నాకు కరోనా లేదు అనుకున్నాడు…కానీ “పనస” వల్ల అసలు కథ బయటపడింది!

నాకు కరోనా లేదు అనుకున్నాడు…కానీ “పనస” వల్ల అసలు కథ బయటపడింది!

by Anudeep

Ads

పనసచెట్టు నుండి పనసపండు మీద పడడంతో  నడుము విరిగిన వ్యక్తి సర్జరీ కోసం హాస్పిటల్లో జాయిన్ అయితే..కరోనా పాజిటివ్ అని వచ్చింది..ఒకవైపు నడుము విరిగిందనే బాధ, మరోవైపు అసలు తనకి కరోనా ఎలా వచ్చింది అనే టెన్షన్.. కరోనా ఎప్పుడు , ఏ రూపంలో వస్తుందో చెప్పలేనట్టుగా అయిపోయింది పరిస్థితి.. ప్రతీది అనుమానించాల్సిన స్థితి.. నాకేం నేను బేషుగ్గా ఉన్నాను అనుకోవడానికి లేదు..  ఇంతకీ ఆ వ్యక్తికి కరోనా ఎలా వచ్చింది.. అసలేం జరిగింది..

Video Advertisement

కాసరగోడ్ లోని బేలూర్ నివాసి అయిన ఒక వ్యక్తి పనసచెట్టు నుండి పనసపండుని తెంపుదామని చెట్టు దగ్గరకు వెళ్లాడు..ఇంతలో చెట్టుపై నుండి ఒక పనసకాయ వచ్చి అతనిపై పడింది.. దాంతో తలకు , వెన్నుకి తీవ్రగాయాలయ్యాయి.వెంటనే సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు..కానీ డాక్టర్స్ కి ఉన్న ప్రోటోకాల్ ప్రకారం సర్జరీకి ముందు అన్ని టెస్టులతోపాటు కరోనా టెస్టు కూడా చేసి తీరాల్సిందే..టెస్టు చేస్తే ఇంకేం ఉంది . రిజల్ట్ పాజిటివ్..

సదరు వ్యక్తి కి ఇప్పుడు ఆ గాయాలకంటే , ఈ కరోనా పాజిటివ్ అనే సమస్య తొలిచేస్తుంది..ఎందుకంటే అతడు ఈ మధ్య కాలంలో ఎక్కడికి ప్రయాణం చేసింది లేదు.కరోనా లక్షణాలున్న వ్యక్తిని కలిసిన దాకలాలు లేవు..తను ఆటోడ్రైవర్ గా చేస్తున్నప్పటికి ఈ మధ్యకాలంలో తను ఆటో తీసింది లేదు.. కాబట్టి ప్రయాణికుల ద్వారా తనకి కరోనా సోకింది అనుకోవడానికి లేదు..ఇలా అసలు తనకి కరోనా ఎలా వచ్చిందా అని ఆలోచిస్తే…తనొకసారి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లానని, అక్కడే తనకు కరోనా అంటుకుని ఉండవచ్చని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం అతని కుటుంబం మొత్తం హోం క్వారంటైన్ లో ఉన్నారు.. అంతేకాదు అతను ఇటీవల ఎంతమందిని నేరుగా కలిసాడు  అనేది ఆరా తీస్తున్నారు అధికారులు..

 

 


End of Article

You may also like