ఇప్పుడు ఆసియాలో రిచ్ “అంబానీ” కాదు…”జాక్‌మా”! ఇంతకీ ఎవరు ఈ “జాక్‌మా”?

ఇప్పుడు ఆసియాలో రిచ్ “అంబానీ” కాదు…”జాక్‌మా”! ఇంతకీ ఎవరు ఈ “జాక్‌మా”?

by Anudeep

కరోనా ఎఫెక్ట్ మామూలుగా లేదు కదా? చిన్న చిన్న వ్యాపారస్తులకు నష్టం చేకూర్చడం కాదు , ఏకంగా కుబేరుల స్థానాలకే ఎసరు పెట్టింది . ఇప్పటివరకు ఏషియాలోనే అత్యంత ధనవంతుడైన మన ముఖేశ్ అంబాని స్థానాన్ని అమాంతం తగ్గించేసింది. ముడి చమురు ధరలు కుప్పకూలడంతో అంబాని స్థానం జాక్ మా సొంతమైంది. ప్రస్తుతం ఆసియాలో అత్యంత ధనవంతుడు జాక్ మా.. ఎవరీ జాక్ మా

Video Advertisement


చైనాలో పుట్టిన కరోనా వైరస్ చైనావాసుల్ని భయపెట్టినప్పటికి , చైనా వాసుడే అయినా జాక్ మా కి అపర కుబేరుడి స్థానాన్ని కట్టపెట్టింది. అంబాని నికర సంపద 540కోట్లు డాలర్లు నష్టపోవడంతో, అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

ఒకప్పుడు ఇంగ్లీషు నేర్చుకోవడానికి చైనాకు వచ్చే విదేశీయులకి గైడ్ గా పని చేసేవాడు జాక్ మా. జాక్ మా జీవితంలో అన్ని యాదౄచ్చికంగా జరిగాయి .తొమ్మిదేళ్లు గైడ్ గా పనిచేసిన జాక్ మా కి ఒకసారి ఆస్ట్రేలియాకి చెందిన కుటుంబంతో పరిచయం అయింది. ఆ కుటుంబం ఆహ్వానంతో ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆ పర్యటనే జాక్ మాలో ఎన్నో మార్పుల్ని తీసుకొచ్చింది.  ఒకప్పుడు జాక్ మా లక్ష్యం ఆంగ్ల ఉపాధ్యాయుడు కావడం, దానికి తగిన విద్యని అభ్యసించాడు. వెయ్యి రూపాయలకు ఇంగ్లీషు క్లాసులు భోదించాడు. వచ్చే వెయ్యిరూపాయల జీతం సరిపోకపోవడంతో అది వదిలేసి మరో ఉద్యోగం వెతుక్కోవాలనుకున్నాడు. ఆ ఉద్యోగంలో భాగంగా అమెరికా వెళ్లాడు.

ఇప్పుడు మనం మనకి తెలియని ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి గూగుల్ ని ఆశ్రయిస్తాం. అమెరికాలో ఉన్నప్పుడు జాక్  కి తన ఫ్రెండ్ సర్ఫింగ్ ఎలా చేయాలో నేర్పించాడు.అదంతా వింతగా అనిపించిన జాక్ కి చైనాకి సంబంధించిన ఒక్క విషయం తనకి దొరక్క పోవడం నిరాశపర్చింది.కానీ అదే అవకాశం అని భావించి చైనా ఫేజెస్ అని వెబ్సైట్స్ స్టార్ట్ చేశాడు.

చైనా పేజెస్ తర్వాత అలీబాబా .కామ్ అని ఈ కామర్స్ సంస్థని స్థాపించాడు. అలీబాబా పేరునే ఎందుకు సెలక్ట్ చేసుకున్నాడని డౌటొస్తుందా. అలీబాబా కథల్లో అలిబాబా నిదుల్ని వెలికితీస్తాడు. ఒకరకంగా అలీబాబా.కామ్ చేసే పని కూడా అదే , అందుకే ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన పేరుని పెట్టాలని ఆ పేరు పెట్టాడు.

పద్దెనిమిది మంది పరిచయస్తులు ఇచ్చిన 36లక్షల పెట్టుబడితో ప్రారంభమయిన  ఆన్లైన్ వ్యాపార సంస్థ ఇప్పుడు జాక్ మా ని ఆసియాలోనే అత్యంత కుబేరుడిగా నిలబెట్టింది. ఆనాడు ఎవరూ ఊహించి ఉండరు జాక్ మా ఈ స్థానాన్ని చేరుకుంటాడని, తను కూడా ఊహించి ఉండడు.


You may also like