ఆ స్టార్ హీరోకి కరోనా..? చివరికి ఇలా క్లారిటీ ఇచ్చారు..!

ఆ స్టార్ హీరోకి కరోనా..? చివరికి ఇలా క్లారిటీ ఇచ్చారు..!

by Anudeep

Ads

కరోనా కరోనా ప్రజెంట్  ఎక్కడ చూసిన ఇదే చర్చ. ఏ నోట విన్నా ఇదే మాట . సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు అందరికి కరోనా భయం పట్టుకుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ మిగతా ప్రపంచ దేశాలకు పాకింది. నిన్న మొన్నటి వరకు మనకూ అదే టెన్షన్ , కాకపోతే మన దగ్గర పాజిటివ్ కేసులు లేవు అనే సరికి కొంచెం ఊపిరి పీల్చుకున్నారు.తాజాగా యాక్షన్ హీరో జాకీజన్ కరోనా బారినపడ్డారిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై స్వయంగా జాకీచానే వివరణ ఇచ్చారు.

Video Advertisement

కరోనా కేవలం  మనుషులనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోంది. సినీ పరిశ్రమపై కూడా ఈ వైరస్ ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే మన దగ్గర సినిమా హాళ్లని కొద్ది రోజులు మూసివేయాలని సినీపెద్దలు నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త వాట్సప్లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఏది నిజమో? ఏది అబద్దమో తెలుసుకోలేకపోతున్నారు మామూలు జనం. జాకీచాన్ కరోనా అనే పుకారు ఫస్ట్ హంకాంగ్‌లో మొదలైంది . ఇంకేం మన సోషల్ మీడియా ఉంది కదా, వద్దు బాబోయ్ అన్నా కూడా వైరల్ చేసి పడేస్తుంది. అలా వైరల్ చేసిన వార్తల్లో ఇదొకటి.

జాకీ చాన్ అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు. ఇంకేముంది వైరలైన కొద్ది గంటల్లోనే తమ అభిమాన స్టార్ త్వరగా కోలుకోవాలంటూ పెద్ద ఎత్తున పరామర్శలు వెల్లువెత్తాయి. గెట్ వెల్ సూన్ అంటూ ప్రపంచం నలుమూలల నుండి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.

చివరకు ఈ విషయం జాకీ చాన్ వరకు వెళ్లింది. తాను బాగానే ఉన్నాను కదా..ఈ పుకారు ఎలా పుట్టింది ? అంటూ ఆలోచించారు. ఇది ఇలాగే వదిలేస్తే బాగుండదని, చివరకు ఆయన రెస్పాండ్ అయ్యారు. తాను బాగానే ఉన్నానని, తనకు కరోనా వైరస్ సోకినట్లుగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ ప్రకటించారు.


End of Article

You may also like