Ads
మరి కొన్ని నెలలలో జరగనున్న అసెంబ్లీ ఎలెక్షన్స్ టార్గెట్‌గా వైసీఆర్ కాంగ్రెస్ అధిష్టానం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. పదకొండు నియోజకవర్గాలలో ఇన్‌ఛార్జ్‌లను మారుస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఈ విషయం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
Video Advertisement
ఒకేసారి ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా పదకొండు మంది నియోజకవర్గాల ఇన్‌చార్జీల వైసీపీ పార్టీ మార్చేసింది. డిసెంబర్ 11న పదకొండు నియోజకవర్గాలలో ఎంపిక చేసిన నూతన ఇన్‌ఛార్జ్‌ల పేర్లను అనౌన్స్ చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడుగురు ఇన్‌చార్జీలను మార్చింది. దీంతో వైసీపీ మార్పు వెనుక స్ట్రాటజీ ఏంటని చర్చ జరుగుతోంది.
వచ్చే అసెంబ్లీ ఎలెక్షన్స్ లో 175 నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్న వైసీపీ, తాజగా 11 నియోజకవర్గాల్లో ఇన్‌చార్జులను మార్చింది. కొండెపి- ఆదిమూలపు సురేష్, మంగళగిరి- గంజి చిరంజీవి, ప్రత్తిపాడు- బాలసాని కిరణ్ కుమార్, వేమూరు- వరికూటి అశోక్ బాబు,సంతనూతలపాడు- మేరుగ నాగార్జున, తాడికొండ- మేకతోటి సుచరిత, చిలకలూరిపేట- మల్లెల రాజేశ్ నాయుడు, అద్దంకి- పాణెం హనిమిరెడ్డి, గుంటూరు పశ్చిమ- విడదల రజినీ, గాజువాక- వరికూటి రామచంద్రరావు, రేపల్లె- ఈవూరు గణేష్ లను ఇన్‌చార్జులగా నియమించారు.యర్రగొండపాలెం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదిమూలపు సురేష్‌ను తాజాగా కొండెపికి ఇన్‌చార్జిగా మార్చడం చర్చకు దారి తీసింది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకుడు డోలా బాలవీరాంజనేయస్వామి స్థానం ఇది. 2014 మరియు 2019 ఎలెక్షన్స్ లో ఇక్కడి నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. అందువల్ల వచ్చే ఎన్నికలలో కూడా ఆయనే పోటీ చేసే అవకాశం ఉండవచ్చు.
కొండెపికి ఇన్‌చార్జిగా మార్చడం పై తాజాగా ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. నియోజకవర్గ మార్పు విషయంలో పార్టీ నిర్ణయమే పాటిస్తానని, అధిష్టానం ఆదేశాల మేరకు పని చేస్తానని వెల్లడించారు. పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తానని, సైనికుడిలా పార్టీ విజయం కోసం పనిచేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తమకు కెప్టెన్ అని అన్నారు. కొండెపి నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని వెల్లడించారు.
Also Read: ఎవరు ఈ శాంభవి..? 13 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చింది..?
End of Article