ఎవరు ఈ శాంభవి..? 13 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చింది..?

ఎవరు ఈ శాంభవి..? 13 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చింది..?

by kavitha

Ads

కొన్ని సంవత్సరాల క్రితం ఆధ్యాత్మిక ప్రవచనాలతో బాల యోగిని శాంభవి ప్రసిద్ధి గాంచింది. అయితే పదమూడేళ్ళ తరువాత  ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచారు. చిన్నారి శాంభవి ఇప్పుడు పెద్దగా అయ్యారు. సంచలన కామెంట్స్ చేయడం ద్వారా నెట్టింట్లో వైరల్ గా మారారు.

Video Advertisement

ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల అవుతున్నాయి.  బ్రహ్మంగారు త్వరలో వీరభోగ వసంతరాయలుగా జన్మిస్తారని వెల్లడించారు. ఆమె 13 ఏళ్ళ తరువాత బయటకు ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం..
2009, 2010 సంవత్సరాల సమయంలో చిన్నారి శాంభవి ఐదేళ్ల వయసులో బాల సన్యాసినిగా ఫేమస్ అయ్యింది.  నంద్యాలలో కొంతకాలం నివసించిన శాంభవి, బ్రహ్మం గారి గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడేది. శాంభవి మీడియా ముందు చెప్పే మాటలు జనాలను ఎంతగానో ఆకర్షించాయి. ఆమె మాట్లాడుతూ, “తాను, దలైలామా పూర్వ జన్మలో బౌద్ధులమని, మంచి స్నేహితులమంటూ చెప్పి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి ఆమెకు పూజలు చేశారు. అంతేకాక టిబెటన్ ప్రజల స్వాతంత్ర్యం కోసం పోరాడడమే లక్ష్యమని శాంభవి పేర్కొంది.
ఆ తర్వాత పలు కారణాల వల్ల చిన్నారి శాంభవి నంద్యాల నుండి హిమాలయాలకు వెళ్లిపోయారు. 13 ఏళ్ళ తరువాత యోగిని శాంభవి మళ్లీ నంద్యాలలోని కనిపించారు. కార్తీక మాసం సందర్బంగా సూర్యనంది, నంద్యాల బస్టాండ్ వద్ద ఉన్న శివాలయంలో శాంభవి ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో యోగిని శాంభవి మీడియాతో మాట్లాడుతూ “బ్రహ్మంగారు వీరభోగ వసంతరాయలుగా జన్మిస్తారని, బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలన్ని జరిగాయని, ఇంకా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని హిందీ, ఇంగ్లీషులో ట్రాన్స్‌లేట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటూ, సంస్కృతం వేదాలు నేర్చుకున్నట్లుగా తెలిపారు.
బ్రహ్మంగారి అనుగ్రహం వల్లే గతంలో సూర్యనందికి వచ్చామని, ఆయన అనుగ్రహంతో సూర్యనంది నుండి హిమాలయాలకు వెళ్లామని అన్నారు. ఇక్కడ బ్రహ్మంగారికి ఆశ్రమం, గుడి కట్టాలనే సంకల్పం ఉందని అన్నారు. ఇక్కడి నుండే ధర్మ సంస్థాపన ప్రారంభిస్తానని వరం ఇచ్చారని,  బ్రహ్మంగారికి నిలయంగా ఒక గుడి ఉండాలనే సంకల్పం ఉందని, త్వరలోనే దానిని మొదలుపెట్టబోతున్నామని, ఆ కారణంగానే సూర్యనందికి వచ్చానని తెలిపారు.  మళ్లీ శాంభవి నంద్యాలకు రావడం, బ్రహ్మంగారి గురించి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Also Read: మీరు ఈ సంవత్సరంలో పుట్టినట్లయితే .. 2024 మీ జీవితంలో పెను మార్పులు తీసుకురాబోతుంది!


End of Article

You may also like