మీరు ఈ సంవత్సరంలో పుట్టినట్లయితే .. 2024 మీ జీవితంలో పెను మార్పులు తీసుకురాబోతుంది!

మీరు ఈ సంవత్సరంలో పుట్టినట్లయితే .. 2024 మీ జీవితంలో పెను మార్పులు తీసుకురాబోతుంది!

by Mounika Singaluri

2023 సంవత్సరం ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెళ్ళిపోబోతుంది. ఇంకొక 15 రోజుల్లో మనం 2024 లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. అయితే ఇప్పటికే ఈ సంవత్సరం ఎలా ఉంటుందా అని చాలామంది జాతకాలని చూసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏ సంవత్సరం అయినా కొంతమందికి మంచిని తీసుకువస్తే కొంతమంది జీవితాల్లో చెడుని తీసుకువస్తుంది. అయితే 1995లో పుట్టిన వారికి మాత్రం 2024 సంవత్సరం పెను మార్పులు తీసుకువస్తుంది అంటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు.

Video Advertisement

zodiac signs

1995లో పుట్టిన వారికి 2024 లో 29 ఏళ్లు వస్తాయి. వీరు తమ కెరియర్ లో ఈ సంవత్సరం చాలా పెద్ద మార్పుని అనుభవిస్తారు. వారు ఈ సంవత్సరాన్ని జీవితంలో మరిచిపోలేనంతగా గుర్తుపెట్టుకుంటారు అంటున్నారు జ్యోతిష్యులు. ఇంత పెద్ద మార్పు ఎందుకు వస్తుందో కూడా వివరిస్తున్నారు. దీని వెనక సంఖ్యలు ఉన్నాయని శని దాదాపు రెండున్నరలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళుతుంది.

అంటే శనిగ్రహం తన రాశిని మార్చుకోవడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. శని దేవుడు పూర్తిగా వెళ్ళటానికి 29 సంవత్సరాలు పడుతుంది. అందుకే వారి మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం శని దేవుడు కుంభరాశిలో ఉన్నాడు. కర్మ ఫలితాలను ప్రసాదించే శనీశ్వరుడు 2025 వరకు కుంభ రాశి లోనే ఉంటాడు. గ్రహాలలో ఎటువంటి అన్యాయం లేకుండా తన పనిని చక్కగా చేయగల శనిదేముడు ఒక రాశిలో సంచరిస్తే రెండు నెలల వరకు ఆ రాశి ని విడిచిపెట్టడు.

నవగ్రహాలలో శని దేవుడు నిదానంగా కదులుతున్న గ్రహంగా పరిగణించబడుతుంది. అలాగే 2024 లో తులారాశి వారికి శని దేవుడు అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాడు. ఇన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ సంవత్సరం పూర్తవుతాయి. చేతిలో నగదు ప్రవాహానికి లోటుండదు అలాగే ఇతరులలో గౌరవాన్ని కూడా తీసుకువస్తుంది. మరి మీరు 1995 సంవత్సరంలో పుట్టినట్లయితే రాబోయే సంవత్సరంలో పండగ చేసుకోవటానికి రెడీగా ఉండండి.


You may also like

Leave a Comment