Ads
- చిత్రం : జై భీమ్
- నటీనటులు : సూర్య, లిజోమోల్ జోస్, కె. మణికందన్, రజిషా విజయన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్.
- నిర్మాత : సూర్య, జ్యోతిక
- దర్శకత్వం : T. J. జ్ఞానవేల్
- సంగీతం : సీన్ రోల్డాన్
- విడుదల తేదీ : నవంబర్ 2, 2021 (అమెజాన్ ప్రైమ్)
Video Advertisement
స్టోరీ :
1990 సమయంలో సినిమా మొదలవుతుంది. చిన్న తల్లి (లిజోమోల్ జోస్), రాజన్న (మణికందన్) ఒక మారుమూల గ్రామంలో నివసించే భార్యాభర్తలు. కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా అమాయకుడైన రాజన్న జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ రాజన్నని చిత్రహింసలు పెడతారు. దాంతో రాజన్న జైలునుండి పారిపోతాడు. అప్పుడు ఏం చేయాలో తెలియక చిన్న తల్లి అడ్వకేట్ చంద్రు (సూర్య) సహాయం అడుగుతుంది. దాంతో చంద్రు రాజన్న కేస్ టేకప్ చేస్తాడు. చంద్రు రాజన్నని బయటకు తీసుకొస్తాడా? సంఘంలో ఉండే వివక్షల కారణంగా రాజన్న దంపతులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు? రాజన్నకి న్యాయం జరిగిందా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సినిమా 1990 సమయంలో జరిగింది. ఆ సమయంలో సంఘంలో కుల,మత వివక్షలు ఎక్కువగానే ఉండేవి. వాటన్నిటినీ ఈ సినిమాలో చూపించారు. కొన్నిచోట్ల వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులు, సినిమా చూసిన ప్రేక్షకులని కంటతడి పెట్టిస్తాయి. స్టోరీలైన్ చిన్నదే అయినా కూడా, చాలా లోతుగా ఆలోచింపచేసేలాగా ఎన్నో ముఖ్యమైన అంశాలను తెర మీద చూపించారు. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే, రాజన్న పాత్ర పోషించిన మణికందన్, అలాగే లిజోమోల్ జోస్ చాలా బాగా నటించారు. వారి నటన చాలా సహజంగా అనిపిస్తుంది.
సినిమాకి ఎంతో ముఖ్యమైన చంద్రు పాత్ర పోషించిన సూర్యకి కూడా మళ్లీ ఒక మంచి పవర్ ఫుల్ రోల్ పడింది. అడ్వకేట్ పాత్రలో పర్ఫెక్ట్ గా సరిపోయారు సూర్య. అలాగే మరికొన్ని ముఖ్య పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్, రావు రమేష్, మరొక హీరోయిన్ రజిషా విజయన్ కూడా బాగా నటించారు. అక్కడ అక్కడ కొంచెం డల్ గా అనిపించినా కూడా, స్టోరీ చాలా బలంగా ఉండడంతో అలాంటి పొరపాట్లు ఏవి పెద్దగా కనిపించవు. చివరికి ఏమవుతుంది అనే ఉత్కంఠతో సినిమా సాగుతుంది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటుల పెర్ఫార్మెన్స్
- కథ
- అప్పటి పరిస్థితులను చూపించిన విధానం
మైనస్ పాయింట్స్ :
- అక్కడక్కడా కొంచెం డల్ అయిన సీన్స్
రేటింగ్ :
3.25/5
ట్యాగ్ లైన్ :
నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరచదు. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ఒక సీరియస్, మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది.
End of Article