Ads
మెగాస్టార్ చిరంజీవి కి టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. గొప్ప నటుడిగా పేరు తెచ్చుకుని ఎంతో ఫేమస్ అయిపోయారు చిరంజీవి. పైగా చిరంజీవి అంటే ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్లందరికీ కూడా ఆదర్శం. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీ లో ఎంతో మంది కష్ట పడుతున్నారు. అయితే చిరంజీవి చేసిన చాలా సినిమాలు చేసారు.
Video Advertisement
పైగా ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి కూడా. చిరంజీవి చేసిన సినిమాల్లో జై చిరంజీవ కూడా ఒకటి. సమీరా రెడ్డి, భూమిక ఈ సినిమాలో హీరోయిన్లుగా చేశారు. జై చిరంజీవ సినిమాలో చిరంజీవి మేనకోడలుగా శ్రియ శర్మ బాగా ఆకట్టుకుంది. ఈ చిన్న పిల్ల చక్కగా మాట్లాడుతూ ఆడియన్స్ ని ఫిదా చేసేసింది. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన ఈ చిన్నారి కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే కాకుండా నువ్వు నేను ప్రేమ సినిమాతో పాటు మరి కొన్ని సినిమాలలో కూడా చేసింది.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ లో కూడా ఈ చిన్నారి నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ చిన్నారి హీరోయిన్ గా అవకాశం కోసం చూస్తోంది. అలానే టీనేజ్ అమ్మాయి పాత్రలు చేస్తోంది. అలీ రాజా హీరోగా తెరకెక్కిన గాయకుడు సినిమా లో శ్రేయ శర్మ హీరోయిన్ గా చేసింది.
అయినప్పటికీ అనుకున్నంత హిట్ అవ్వలేదు సినిమా. తర్వాత నిర్మలా కాన్వెంట్ లో కూడా ఈమె నటించింది. అయితే అప్పటి ఈ చిన్నారు ఎప్పుడు కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలని పంచుకుంటూ ఉంటుంది.
End of Article