Ads
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఎనిమిది నియోజకవర్గాల్లో జనసేన పరిస్థితి ఏమిటి? ఎన్ని ఓట్లు వచ్చాయి? ఏ స్థానంలో అభ్యర్థులు నిలిచారు అనే విషయం చూద్దాం.
Video Advertisement
జనసేన బిజెపి పొత్తులో భాగంగా 8 స్థానాల్లో జనసేన పోటీ చేసింది. కూకట్ పల్లి, తాండూరు, కోదాడ, నాగర్ కర్నూల్, అశ్వరావుపేట, వైరా కొత్తగూడెం, ఖమ్మం స్థానాల్లో జనసేన పోటీలో నిలిచింది. అయితే పోటీ చేసిన ఎనిమిది చోట్ల కూడా జనసేన అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.
జనసేన అభ్యర్థుల తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన కూకట్ పల్లిలో అయితే ఏకంగా బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పవన్ కళ్యాణ్ ప్రచారానికి దిగిన కూడా ఫలితం లేకుండా పోయింది. మిగిలిన స్థానాలతో పోలిస్తే కూకట్ పల్లి లో జనసేన కాస్త మెరుగనే చెప్పాలి. జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కి 39,830 ఓట్లు వచ్చాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా 5000 కంటే తక్కువ పోల్ అయ్యాయి. కూకట్ పల్లిలో సెటిలర్స్ అందరూ కూడా జనసేనకి మద్దతు తెలుపుతారని అందరూ అనుకున్నారు. అయితే అనుకున్నంతగా మద్దతు అయితే రాలేదు.
ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి రెండు స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే ముందు నుంచి జనసేన పోటీ చేస్తుందనే విషయంలోనూ అభ్యర్థులకు కూడా క్లారిటీ లేకుండా పోయింది. నామినేషన్స్ కి ఆఖరి రెండు రోజుల ముందు పోటీలో ఉన్నట్లు ప్రకటించింది. అయితే రూపాయి పంచకుండా తమ అభ్యర్థులు ఇన్ని ఓట్లు సంపాదించుకున్నారని జనసేన నాయకులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
Also Read:ఓటమి ఎరుగని నాయకుడు… 26 ఏళ్ల యువతి చేతిలో ఓడిపోయారు.! ఆమె ఎవరంటే.?
End of Article