యానిమల్ సినిమా పైన స్పందించిన జయప్రకాష్ నారాయణ….ఏమన్నారంటే…?

యానిమల్ సినిమా పైన స్పందించిన జయప్రకాష్ నారాయణ….ఏమన్నారంటే…?

by Harika

Ads

రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా డిసెంబర్ ఒకటో తారీఖున విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. రణబీర్ కపూర్ కెరియర్ లోనే ఒక పెద్ద హిట్ గా నిలిచింది.

Video Advertisement

అయితే యానిమల్ సినిమాని ఎంతగా ఆదరిస్తున్నారో అలాగే కొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా లోక్ సభ లో ఒక ఎంపీ కూడా యానిమల్ సినిమా పైన మాట్లాడుతూ ఈ మూవీ మేకర్స్ ను తప్పు పట్టారు.

animal

అయితే తాజాగా ఈ సినిమా పైన లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ స్పందించారు. సినిమాల వల్ల ప్రజలందరూ చెడిపోరు, మారిపోరు కానీ చూసేవారి ఆలోచన విధానం పైన మాత్రం తీవ్ర ప్రభావం చూపుతుంది అని అన్నారు. అయితే సినిమాలు తీసే నిర్మాతలకు హీరోలకి దర్శకులకి సమాజం పట్ల బాధ్యత ఉండాలని, చెడు ఆలోచనలు కలగకుండా సినిమాలు తెరకెక్కిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

సమాజంలో జరిగే తప్పులకు పూర్తి భాద్యత సినిమాలు అనడం లేదు. అలా అనడం కూడా తప్పు. కానీ ఎంటర్టైన్మెంట్ తో పాటు కొంచెం సమాజం పై భాద్యత వహించి సినిమాలు తీస్తే బాగుటుంది. స్వతంత్ర పోరాటంలో అలా సినిమా తీసేవారు. శివ, యానిమల్ లాంటి సినిమాలు చూస్తే.. నాకే ఎదుటవాడిని చంపేయాలనే భావన కలుగుతుంది అని చెప్పుకొచ్చారు


End of Article

You may also like