జయలలిత లేఖలో రజినీకాంత్ ప్రస్తావన..? అసలు సినిమా ఎందుకు వద్దు అన్నారు..?

జయలలిత లేఖలో రజినీకాంత్ ప్రస్తావన..? అసలు సినిమా ఎందుకు వద్దు అన్నారు..?

by kavitha

Ads

ఒకప్పటి హీరోయిన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తరువాత ఆమె రాసిన ఒక లెటర్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. ఆ లెటర్ 1980లో పీయుష్ అనే వ్యక్తి రాసిన లేకహ అని తెలుస్తోంది. ఆ సమయానికి జయలలిత సినిమాలు మానేసి రాజకీయాల వైపు వెళ్లారు.

Video Advertisement

కానీ ఆమె తిరిగి సినిమాలలో నటించడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఒక మేగజైన్‌లో ప్రచురించిన వార్త పై స్పందిస్తూ జయలలితనే ఈ లేఖను స్వయంగా రాసిందని తెలుస్తోంది. మరి అందులో ఏం రాశారో ఇప్పుడు చూద్దాం..
తాను సినిమాలలో నటించడానికి ప్రయత్నించలేదని, అది నిజం కాదని చెప్పడం కోసం జయలలిత ఆ లెటర్ లో తనకు వచ్చిన ఒక పెద్ద ఆఫర్ ను రిజెక్ట్ చేసిన విషయన్ని ఆ లేఖలో తెలిపింది. 1980లో రిలీజ్ అయిన ‘బిల్లా’ మూవీలో తనకు ఆఫర్ వచ్చిందని, అది కూడా దేశంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఉన్న బాలాజీ ప్రొడక్షన్స్ నిర్మించిన మూవీ అని, ఆ మూవీలో హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఆ సినిమాలో ముందుగా తనకే ఆఫర్ చేశారు.
తాను సినిమాలలో నటించాలనుకుంటే రజినీకాంత్ వంటి సూపర్ స్టార్ పక్కన హీరోయిన్ గా చేసే ఛాన్స్ ను వదులుకునేదాన్ని కాదు అని రాసుకొచ్చారు. తాను ఆ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసిన తర్వాత ఆ అవకాశాన్ని శ్రీప్రియకు బాలాజీ ప్రొడక్షన్స్ ఇచ్చిందని ఆ లెటర్ లో జయలలిత వివరించారు.
అంతే కాకుండా ఈ విషయాన్ని బాలాజీ కూడా పబ్లిగ్గానే వెల్లడించారు. ఈ విషయం అందరికీ తెలుసు. మీరు ఎందుకు తెలుసుకోలేకపోయారో అర్థం కావట్లేదని, ఆ భగవంతుడి దయ వల్ల ఆర్థికంగా తనకి ఎలాంటి కష్టాలు లేవని, తన దృష్టి వేరే వైపు ఉందని, ఇక పై సినీ కెరీర్‌ను కొనసాగించడంలో తనకు ఆసక్తి లేదని జయలలిత ఆ లెటర్ లో తెలిపారు.

Also Read: “ఆట” ప్రోగ్రాంలో చేసిన అబ్బాయి “బిట్టు” ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?


End of Article

You may also like