8 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ…”జయసుధ” కొడుకు హీరోగా నటించిన ఈ సినిమాలు ఏంటో తెలుసా?

8 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ…”జయసుధ” కొడుకు హీరోగా నటించిన ఈ సినిమాలు ఏంటో తెలుసా?

by kavitha

Ads

సహజ నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  హీరోయిన్ గా ఎన్నో హిట్ చిత్రాలలో నటించి ఆడియెన్స్ ను మెప్పించారు. కథానాయకగా ఆణిముత్యాలాంటి చిత్రాలను అందించారు. ఎన్టీఆర్, ఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి వంటి అగ్ర హీరోల పక్కన హీరోయిన్ గా నటించి, ఎన్నో అవార్డులను అందుకున్నారు.

Video Advertisement

జయసుధ సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించారు. హీరో, హీరోయిన్ల తల్లి పాత్రలలో నటించి మెప్పించి, ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని పొందారు. కాగా, జయసుధ కుమారుడు కూడా ఇండస్ట్రీలో  అడగుపెట్టారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, ఆ తర్వాత విలన్ గా నటించారు. ఇప్పుడు మళ్ళీ హీరోగా నటిస్తున్నాడు.

జయసుధ 1985లో బాలీవుడ్ నిర్మాత నితిన్ కపూర్ ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకి ఇద్దరు కుమారులు నిహార్, శ్రేయంత్. పెద్ద కుమారుడు నిహార్ హీరోగా బస్తి అనే మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. చాలామందికి ఈ మూవీ వచ్చిన సంగతి కూడా తెలియదు.

ఆ మూవీ ఫ్లాప్ కావడంతో గ్యాంగ్ స్టార్ గంగరాజు మూవీలో  విలన్ గా నటించి తన లక్ ను  పరీక్షించుకున్నాడు.  కానీ ఆ మూవీ సైతం డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఆ మూవీలో నిహార్ యాక్టింగ్ కు గుర్తింపు వచ్చింది.నిహార్ ఎనిమిదేళ్ళ తరువాత హీరోగా రికార్డ్ బ్రేక్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీ, మార్చి 8 న రిలీజ్ కానుంది.

ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. చదలవాడ శ్రీనివాస్‌ దర్శకత్వం చేస్తూ, నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ తమిళ వెర్షన్ ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది. ఈ వేడుకలో నిహార్ మాట్లాడుతూ ఈ చిత్రం కోసం 5 సంవత్సరాలు కష్టపడ్డానని, తన సినిమాని ఆడియెన్స్ ఆదరిస్తారని నమ్ముతున్నానని చెప్పుకొచ్చాడు. ఈ మూవీని 8 భాషల్లో రిలీజ్‌ చేయబోతున్నారు.

Also Read: ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సివిల్స్‌లో 75వ ర్యాంక్ సాధించిన స్టార్ కమెడియన్ కుమారుడు..ఎవరంటే.?

 


End of Article

You may also like