Ads
ప్రతి యాక్టర్ కి అన్ని రకాల పాత్రలు పోషించాలి అని ఉంటుంది. కానీ ప్రేక్షకులు మాత్రం కొన్ని పాత్రల్లో మాత్రమే యాక్టర్స్ ని అంగీకరిస్తారు. కొంత మంది నటులని లీడ్ రోల్స్ లో యాక్సెప్ట్ చేస్తే, ఇంకొంతమందిని ఇంపార్టెంట్ రోల్స్ లో చూడటానికి ఇష్టపడతారు. కానీ కొంతమందిని మాత్రం ఎటువంటి పాత్రలో అయినా సరే ప్రేక్షకులు స్వీకరిస్తారు.
Video Advertisement
వాళ్లలో ఒకరు జె.డి.చక్రవర్తి. పాత్ర ఏదైనా సరే, జే.డీ. చక్రవర్తి పర్ఫార్మెన్స్ మాత్రం ఆ పాత్రకి న్యాయం చేసేలాగా ఉంటుంది. జె.డి. చక్రవర్తి అసలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. 1989 లో వచ్చిన శివ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు జె.డి. చక్రవర్తి. తర్వాత నేటి సిద్ధార్థ, శ్రీవారి చిందులు, అతిరథుడు, రక్షణ, ఆదర్శం ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు.
శివ నాగేశ్వర రావు గారి దర్శకత్వంలో వచ్చిన మనీ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఇంకా దగ్గరయ్యారు జె.డి.చక్రవర్తి. తర్వాత మనీ మనీ, గులాబి, అనగనగా ఒక రోజు, దెయ్యం సినిమాలతో పాటు బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, ప్రేమకు వేళాయరా సినిమాల్లో కూడా నటించారు. 1998 లో వచ్చిన సత్య సినిమా, జె.డి.చక్రవర్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది.
తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించారు. అంతే కాకుండా మనీ మనీ మోర్ మనీ, సిద్ధం, డర్నా జరూరీ హై, దర్వాజా బంద్ రఖో, హోమం, దుర్గ, ఆల్ ది బెస్ట్ (తెలుగు) సినిమాలకు దర్శకత్వం వహించారు. పాపే నా ప్రాణం సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించారు.
2016 లో జె.డి.చక్రవర్తి, లక్నోకి చెందిన అనుకృతి గోవింద్ శర్మని వివాహం చేసుకున్నారు. అనుకృతి రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించిన శ్రీదేవి సినిమాలో నటించారు. ఈ సినిమాకి జె.డి.చక్రవర్తి దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇంకా విడుదల అవ్వలేదు.
End of Article