మనందరి కోసం జెన్నిఫర్‌…! ఆమె గురించి ఈ విషయాలు తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

మనందరి కోసం జెన్నిఫర్‌…! ఆమె గురించి ఈ విషయాలు తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

by Anudeep

Ads

ప్రపంచ దేశాలన్ని మహా ప్రళయాన్ని ముఖాముఖి ఎదుర్కొంటున్నాయి. మూడవ ప్రపంచ యుద్దాన్ని తలపిస్తూ ప్రపంచదేశాలని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనడానికి అన్ని దేశాలు నడుంబిగించాయి.  ఈ వ్యాక్సిన్ ఏ మేరకు పనిచేస్తుందనే కీలకమైనది క్లినికల్ ట్రైలర్స్ దశలో ఉంది. ఆ క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్ ని పరీక్షించడానికి తన శరీరాన్నే ప్రయోగశాలగా మార్చింది జెన్నిఫర్ .

Video Advertisement

నిజానికి క్లినికల్ ట్రైలర్స్ ని నేరుగా మనుషులపైన చేయడానికి లేదు, అయినప్పటికి ప్రస్తుతం సమయం లేని కారణంగా మనుషులపైనే ప్రయోగాలు చేయడానికి సిధ్దపడ్డారు. దీంట్లో భాగంగా కరోనా వైరస్‌ నివారణకు తయారు చేసిన టీకా ప్రయోగాలను చేయడానికి స్వఛ్చందంగా ముందుకు వచ్చింది జెన్నిఫర్ హాలేర్. ఇది డబ్బుకోసం చేయడానికి ఆమె పేదరికంతో బాధపడట్లేదు, సాఫ్ట్వేర్ కంపెనీలో ఆఫరేషనల్ మేనేజర్.

అమెరికాలోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఆపరేషనల్‌ మేనేజర్ గా పనిచేస్తున్న జెన్నిఫర్ వయసు 43ఏళ్లు. భర్త , ఇద్దరు పిల్లలు , ఉద్యోగం ఇదే తన జీవితం. కాని ఇటీవల కరోనా ప్రబలడంతో  చాలా సంస్థలు వర్క్ ఫ్రం హోం కేటాయించాయి. జెన్నిఫర్‌ కూడా వర్క్ ఫ్రం హోంలో ఉంది. మరో వైపు చాలా సంస్థలు ఉద్యోగాలను తొలగించాయి. ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో సాఫ్ట్‌వేర్‌ టెస్టర్‌ అయిన జెన్నిఫర్‌ భర్త కూడా ఉన్నారు. చాలా కుటుంబాలు తమ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటున్నాయో అనే ఆలోచనలో పడింది.

అదే సమయంలో కరోనా వ్యాక్సిన్‌పై క్లినికల్‌ పరీక్షలకు 15- 55 ఏళ్లలోపు అభ్యర్థులు కావాలనే ప్రకటన ఆమె కంటపడింది. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తాను ఇంతకంటే సాయం చేసే అవకాశం ఉండదని భావించిన జెన్నిఫర్, వెంటనే దానికి అప్లై చేసింది. ఈ పరీక్షలకు చాలా మందే ముందుకు వచ్చారు. వారిలో హాలెర్‌తోపాటు మరో నెట్‌వర్క్‌ ఇంజినీరు, మరొక ఎడిటోరియల్‌ కోఆర్డినేటర్‌ ని మాత్రమే ఎంపిక చేశారు.ఈ ముగ్గురులో మొదటగా వ్యాక్సిన్ షాట్ తీసుకున్న వ్యక్తి జెన్నిఫర్.

టీకా తీసుకున్న తరువాత తన శరీరంలో వచ్చే మార్పులను అంచనా వేస్తూ తరచూ వివిధ పరీక్షలను చేస్తారు. సుమారు నెల తర్వాత మరో డోస్ టీకా ఇస్తారు. ఈ నెల పరీక్షల కాలం పాటు జెన్నిఫర్ డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండాలి . అసలు ఏ ప్రయోగం చేయని ఔషదాన్ని బాడీలోకి తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే దాని వల్ల ప్రయోజనాలు కాని, దుష్ప్రభావాలు కాని తెలియవు. అవి శరీరంలోకి వెళ్లాక ఒక్కోసారి నెగటివ్ ప్రభావాన్ని కూడా చూపించవచ్చు. ప్రపంచం కోసం ప్రాణాలకి తెగించి ముందుకొచ్చిన జెన్నిఫర్ త్యాగానికి మనం ఏం చేసినా, ఎంత ప్రశంసించినా చాలా తక్కువే అవుతుంది.

అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌), మోడెర్నా సంస్థలు mRNA-1273 అనే సైంటిఫిక్ నేమ్ తో ఈ టీకాను అభివృద్ధి చేశాయి.  ” నిస్సహాయంగా ఉన్న ప్రజల్లో ఒక మార్పు తీసుకురావడానికి దొరికిన అవకాశం. సంక్షోభ సమయంలో మన కుటుంబం మాత్రమే అని ఆలోచించడం సహజం. అలాంటి సమయంలో మేల్కొని ఇతరులకు ఉపయోగపడే అవకాశం రావడం వరంగా భావిస్తా. దీన్ని సరికొత్త సాంకేతికతో చేశారు. దీనిలో వైరస్‌ ఉండదు” అని ధైర్యంగా ముందుకు వెళ్లిన జెన్నిఫర్ ఇప్పుడు ప్రపంచం అందరి తరపున పోరాడుతున్న సైనికురాలు . రియల్లీ హ్యాట్సాఫ్ హర్.


End of Article

You may also like