Ads
ప్రతి హీరోకి తనలోని యాక్టింగ్ పొటెన్షియల్ కరెక్ట్ గా చూపించిన సినిమా ఒకటి ఉంటుంది. అలా నాచురల్ స్టార్ నాని కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా జెర్సీ. 2019 లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్రిటిక్స్ ప్రశంసలను కూడా అందుకుంది. సాధారణంగా ఒక యాక్టర్ ఫీల్ అయిన ఎమోషన్ ని ప్రేక్షకులు ఫీల్ అయితే ఆ యాక్టర్ సక్సెస్ అయినట్టే.
Video Advertisement
ఈ సినిమాలో నాని పోషించిన అర్జున్ పాత్ర బాధపడితే మనం కూడా బాధపడ్డాం. సంతోష పడితే మనం కూడా సంతోష పడ్డాం. ఇంక నాని పెర్ఫార్మన్స్ ఎలా ఉందో ఈ పాటికి మీకే అర్ధమైపోయి ఉంటుంది. అయితే, జెర్సీ సినిమా ఒక నిజ జీవిత కథ ఆధారంగా తీశారు. మనకి సినిమా స్టోరీ మొత్తం దాదాపు 90 లో జరిగినట్టు చూపిస్తారు.
నిజానికి అదే సమయంలో ఒక సంఘటన జరిగింది. రమణ్ లాంబా ఇండియన్ క్రికెటర్. ఆయన నాలుగు టెస్ట్ మ్యాచ్ లు, 32 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడారు. ఒక అన్ అఫీషియల్ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో ఐర్లాండ్ కి ప్రాతినిధ్యం వహించారు. ఫిబ్రవరి 20, 1998 లో ధాకాలోని బంగ్ బంధు స్టేడియంలో, అబహని క్రీర చక్ర నిర్వహించిన ప్రీమియర్ డివిజన్ క్రికెట్ మ్యాచ్ వర్సెస్ మొహమ్మద్ స్పోర్టింగ్ క్లబ్ ఫైనల్ మ్యాచ్ లో ఆడుతున్నారు రమణ్ లాంబా.
ఓవర్ లో ఇంకొక మూడు బంతులు మిగిలి ఉన్నప్పుడు పొజిషన్ నుండి మారమని అడిగారట. అప్పుడు తన టీం మేట్స్ హెల్మెట్ ధరించమని చెప్పారట. కానీ దగ్గరగా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించకూడదు అని అంతకుముందు తన టీం మేట్స్ నుండి తెలుసుకున్నారట రమణ్ లాంబా. అలా ఆడుతున్నప్పుడు మెహ్రాబ్ హుస్సేన్ వేసిన బంతి తలకి (టెంపుల్) తగలడంతో రమణ్ లాంబా కి గాయం అయ్యింది.
ఇంటర్నల్ హేమరేజ్ అయ్యి కోమా లోకి వెళ్లారు. బంగ్లాదేశ్ లోని ధాకా లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 23 వ తేదీ 1998 లో రమణ్ లాంబా చివరి శ్వాస విడిచారు. ఈ కథ ఆధారంగానే జెర్సీ సినిమా తీశారు అని అంటూ ఉంటారు.
images source : Facebook (Raman Lamba)
End of Article