Ads
జియోతో సంచలనాలకు తెర తీసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీ ప్రస్తుతం షాక్ లో ఉన్నారు. దానికి కారణం రిలయన్స్ జియో సంస్థ ఒక్కసారిగా కోటి 29 లక్షల మంది వినియోగదారులను కోల్పోవడమే. కేవలం ఒక్క నెల వ్యవధిలోనే జియో సంస్థ భారీగా వినియోగదారులను కోల్పోయింది.
Video Advertisement
డిసెంబర్ నెలలో ఇంతమంది వినియోగదారులను జియో కోల్పోయిందని ట్రాయ్ తన రిపోర్ట్ లో పేర్కొంది. ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో జియో సంస్థ వినియోగదారులను కోల్పోవడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఇటీవల జియో సంస్థ కూడా యూజర్లకు సంస్థ పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉన్నట్లుండి ఇరవై ఐదు శాతం టారిఫ్ ను పెంచుతున్నట్లు గతేడాది నవంబర్ నెలలో ప్రకటించింది. ఆ ప్రకటన తరువాతే జియో వినియోగదారుల సంఖ్య తగ్గడం మొదలైంది. మొదట్లో తక్కువ ధరలకు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇచ్చిన జియో ఇప్పుడు రేట్లు పెంచడంతో పాటు ఆఫర్లను కూడా తగ్గించింది.
మరోవైపు ప్లాన్ వాలిడిటీ గడువు కూడా తక్కువగానే ఉంటోంది. దీనితో త్వరగానే రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. దీనితో ఇతర టెలికాం సంస్థలనుంచి జియో కి మారిన వారు ఈ రేట్లు చూసి షాక్ అవుతున్నారు. మరోవైపు మిగతా నెట్ వర్క్ లు కూడా ఇదే బాపతులో ధరలు బాదేస్తున్నాయి. ఉన్నట్లుండి రేట్లు పెంచడమే జియో వినియోగదారుల సంఖ్య తగ్గడానికి కారణమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఎయిర్టెల్ సంస్థ కస్టమర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం జియో వినియోగదారులు 41.57 కోట్లు కాగా, ఎయిర్టెల్ వినియోగదారుల సంఖ్య 35.57 కోట్లుగా ఉంది.
End of Article