జియో ఫోన్ నెక్స్ట్ ….అతి తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్

 జియో ఫోన్ నెక్స్ట్ ….అతి తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్

by Anudeep

Ads

ఇప్పటికే జియో మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో తన రీఛార్జ్ ఆఫర్లతో వినియోగదారులకు ఎంతగానో చేరువయ్యింది. అంతేకాకుండా తక్కువ ఖరీదులో జియో తన మొబైల్స్ ని కూడా లాంచ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు తమ మొదటి స్మార్ట్ ఫోన్ తో వినియోగదారులకు మరింతగా చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారు ఇందుకుగాను మొదటి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ జియో నెక్స్ట్ ఫోన్ ని గూగుల్ వారి భాగస్వామ్యంతో అందించనున్నట్లుగా తెలుస్తోంది.

Video Advertisement

ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ విషయంలోకి వెళితే అవి ఈ విధంగా ఉన్నాయి. రిలయన్స్ వారు తమ AGM మీటింగ్ లో షేర్ చేసిన ఫొటోస్ ప్రకారం ఈ జియో ఫోన్ అనేది చూడడానికి పాత తరహా స్మార్ట్ ఫోన్ డిజైన్లా ఉన్నప్పటికీ ఇవి 5.5 ఇంచెస్ స్క్రీన్ ని కలిగి ఉండి హెచ్డి ప్లస్ డిస్ప్లే తో 720 × 1440 పికల్స్ రిజల్యూషన్ తో అందిస్తున్నారు, ఇది స్నాప్ డ్రాగన్ 205 Soc కలిగి ఉంది 3GB రామ్, 32 GB ఇంటర్నల్ మెమరీ ని కలిగి ఉంటుంది. దీని యొక్క మెయిన్ కెమెరా 13 మెగా పికల్స్ కాగా ఫ్రంట్ కెమెరా 8 మెగా పాకల్స్ గా ఉంది. ఇది 2500 mah బ్యాటరీ కెపాసిటీ కలిగి, ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ తో వస్తుంది.


ఇంకా దీని ధర విషయానికి వస్తే వీటిలో రెండు రకాల ఫోన్ లు అందుబాటులో ఉంటాయని ఒక రకం జియో నెక్స్ట్ ఫోన్ దీని ధర 5 వేల వరకు ఉండవచ్చునని, రెండవ రకం జియో నెక్స్ట్ అడ్వాన్స్డ్ ధర 7 వేల వరకు ఉండవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే జియో సంస్థ వారు ఇప్పటికే వివిధ రకాల బ్యాంకులతో అనుసంధానం అయిన కారణంగా వినియోగదారులు వీటినుంచి రాయితీ పొందే అవకాశం ఉందని తెలియజేశారు అంతేకాకుండా వినియోగదారులు ఈ ఫోన్లను కొన్నట్లు అయితే ఒకేసారి మొత్తం అమౌంట్ కట్టవలసిన అవసరం లేదని ఐదు వేల రూపాయల ఫోన్ కొన్నాట్లయితే ఉన్నట్లయితే మొదటగా 500, 7000 రూపాయల ఫోన్ కొన్నట్లు అయితే మొదటగా 700 చెల్లించి తర్వాత ప్రతి నెల వారికి అనుసంధానంగా ఉన్న బ్యాంకు ద్వారా కొంత అమౌంట్ ని చెల్లించే వెసులుబాటు కలిగించినట్లు తెలియజేశారు.


End of Article

You may also like