“మీమ్స్” చేస్తే లక్షల్లో జీతం ఇస్తారా..! ఎక్కడో తెలుసా..?

“మీమ్స్” చేస్తే లక్షల్లో జీతం ఇస్తారా..! ఎక్కడో తెలుసా..?

by Anudeep

Ads

మీమ్స్.. ఎంతటి సీరియస్ విషయాన్ని అయినా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సున్నితంగా చెప్పడమే. ప్రస్తుత కాలం లో మీమ్స్ గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ మీమ్స్ తయారు చేసే వ్యక్తులు ఎంతో టాలెంట్ తో జనాలని అలరిస్తున్నారు. పేజీలకు సైతం ఫాలోవర్స్‌ను పెంచుకోవడానికి మీమ్స్ అనేవి బెస్ట్ ఆప్షన్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అంతటా మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

Video Advertisement

తాజాగా బెంగళూరు కి చెందిన ఒక కంపెనీ మీమ్స్ తయారు చేసేవాళ్ళు కావాలంటూ ఒక ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. ‘కాలు బయట పెట్టకుండా.. ఇంట్లో నుంచే లక్షల్లో సంపాదన ఆర్జించవచ్చు. కేవలం మీరు చేయాల్సిందల్లా మీమ్స్ చేసుకుంటూ పోవడమే.. దానికి ప్రతిఫలంగా భారీ శాలరీ ప్యాకేజీ మీ సొంతం..’ ఇదే ఆ ఉద్యోగ ప్రకటన సారాంశం. ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆకట్టుకొంటున్న మీమ్స్ ను పలు సంస్థలు తమ బ్రాండింగ్‌కు వాడుకుంటున్నాయి.

bangalore company publish notification for chief meme officer..!!

యూజర్లను ఆకట్టుకునే విధంగా మీమ్స్ క్రియేట్ చేస్తే చాలు.. ఆ సంస్థలకు కావాల్సినంత పబ్లిసిటీ వస్తోంది. సినిమాలు, రాజకీయాలు, ఆటలు.. ఇలా ఏ రంగం గురించైనా సరే, వాటిల్లో జరిగే విషయాలను తెలుసుకోవాలంటే మీమ్స్​ చూడాల్సిందే. ఈ నేపథ్యం లో బెంగళూరుకు చెందిన స్టాక్‌గ్రో అనే అంకుర సంస్థ మీమర్స్‌కు ఓ బంపరాఫర్ ప్రకటించింది. చీఫ్ మీమ్ ఆఫీసర్ ఉద్యోగం కోసం ఒక ప్రకటన విడుదల చేసింది.. ఆందులో నెలకు రూ. 1 లక్ష శాలరీ ఇస్తామని పేర్కొంది.

bangalore company publish notification for chief meme officer..!!

ఫైనాన్స్‌, స్టాక్‌ మార్కెట్‌ విభాగాలలోని మిలీనియల్స్‌, జనరేషన్‌ జెడ్‌ వయస్సు వారిని లక్ష్యంగా మీమ్స్ చేయాలంటూ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఆఫర్ క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. ఇక ప్రస్తుత కాలం లో మిలినియల్స్, జనరేషన్ జెడ్ అంటే 1981 నుంచి 1996 వరకు వయసు ఉన్న వారిని మిలినియల్స్ అంటున్నారు. అలాగే ఆ తర్వాత పుట్టిన వారిని జనరేషన్ జెడ్ గా అభివర్ణిస్తున్నారు. ఏదేమైనా మన అభిరుచికి సరిపడే ఉద్యోగం కోసం ఎదురు చూసే టాలెంట్ ఉన్న మీమర్స్ కి ఇది చక్కటి అవకాశం.


End of Article

You may also like