గత 10 రోజుల నుండి ట్రెండ్ అవుతున్న ఈ పాట విన్నారా.? మొదట్లో ట్రోల్ చేసారు..తర్వాత.!

గత 10 రోజుల నుండి ట్రెండ్ అవుతున్న ఈ పాట విన్నారా.? మొదట్లో ట్రోల్ చేసారు..తర్వాత.!

by Sainath Gopi

Ads

గతంలో రీమేక్‌లు చేసినా, ఇతర భాషలలోని ట్యూన్లు కాపీ చేసినా ఎవరికి తెలిసేది కాదు. కానీ సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడ ఏ భాష నుండి కాపీ చేసినా వెంటనే తెలిసిపోతోంది. జనాలు కూడా ఇట్టే పసిగడుతున్నారు.

Video Advertisement

ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన యోగి సినిమా రీరిలీజ్ అయ్యింది. ఈ మూవీలోని ‘ఓరోరి యోగి’ పాట అప్పట్లో ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. అయితే ఇప్పుడు నెటిజెన్లు ఆ పాటను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
గత వారం యోగి మూవీని రీరిలీజ్ చేశారు. థియేటర్లు ఈ మూవీలోని ‘ఓరోరి యోగి’ పాటకు ఓ రేంజ్ లో ఊగిపోయాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఈ ట్యూన్ ఒరిజినల్ కన్నడ పాట కూడా నెట్టింట్లో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. దాంతో తెలుగు సాంగ్ నే ఒరిజినల్ సాంగ్ అని అనుకున్నారు. తెలుగు పాటను కన్నడ సినిమా వాళ్ళు కాపీ చేశారనుకున్నారు.
అయితే ఆ సాంగ్ కన్నడలోనే ముందుగా వచ్చింది. కన్నడలో స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన  ‘జోగి’ మూవీ 2005 లో రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలోని లవ్ సాంగ్ ట్యూన్‌నే తెలుగువాళ్ళు  కాపీ చేశారు. కన్నడలో మూవీలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చిన మంచి లవ్ సాంగ్ ను తెలుగులో  ఐటం సాంగ్‌గా తెరకెక్కించారు.
ఇంత మంచి సాంగ్ ను ఐటం సాంగ్‌గా మార్చారు కదరా? అని నెటిజెన్లు ఈ పాట పై ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై  మీమ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. కన్నడ ఒరిజినల్ పాట ప్రస్తుతం తెలుగు పాట కన్నా ఎక్కువగానెట్టింట్లో  ట్రెండ్ అవుతోంది. అంతటా కన్నడ సాంగ్ నే వినిపిస్తోంది. ఈ సాంగ్ పై తీసిన రీల్స్, షార్ట్స్ తో కన్నడ పాట ట్రెండింగ్ లోకి వచ్చింది.

watch video:

Also Read: “నిలబెట్టుకోలేకపోయాం..! దీనికి కారణం మనమే..!” అంటూ… “భోళా శంకర్” పై బేబీ ప్రొడ్యూసర్ కామెంట్స్..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like