Ads
కరోనా మహమ్మారి ఎందరో ప్రముఖుల్ని బలి తీసుకుంది. తమ అభిమాన నటులు, గాయకులూ ఈ కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా.. టి ఎన్ ఆర్ గారు మరణ వార్త తెలుగు వారిని శోకసంద్రం లో ముంచేసింది. ఆయన మరణించారన్న వార్తను తెలుగు వారు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.
Video Advertisement

ఆయన ఆఖరు గా విడుదల చేసిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందరు జాగ్రత్త గా ఉండాలంటూ ఆయన హితవు చెప్పారు.ఆ వీడియో ను చూస్తుంటే అభిమానులు కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు.. ఇంటర్వ్యూ చేయడం లో ఆయనకు ఎవరు సాటిరారు. అటువంటి వ్యక్తిని కోల్పోయినందుకు అభిమానులు ఎంతగానో బాధపడుతున్నారు.

తాజాగా.. మరో ఆడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఆయన చివరిగా మాట్లాడిన ఒక ఫోన్ కాల్ కు సంబంధించిన ఆడియో ఫైల్ ఒకటి సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. ఆయన చివరిగా మాట్లాడిన మాటలను విని అభిమానులు కన్నీళ్లు పెడుతున్నారు. “నాకు కాస్త నీరసం గా ఉంది.. ఫీవర్ కూడా ఉన్నట్లు అన్ ఈజీ గా ఉంది..
” అంటూ ఆయన తన చివరి క్షణాల్లో పడుతున్న బాధను చెబుతూ ఉన్న ఈ ఆడియో ఫైల్ ను మీరు కూడా ఈ కింద వీడియో లో వినచ్చు.
End of Article
