Ads
“బాషా ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్టే” ఇది రజనీకాంత్ డైలాగ్. ఇప్పుడు ఇదే డైలాగ్ ని కొంచెం మార్చుకుని వాడుకుంటే సోషల్ మీడియా కు సరిగ్గా సరిపోతుంది. “ఒక్క వీడియో ఒక్కసారి దొరికిందంటే చాలు…అది వందసార్లు…వంద రకాలుగా వైరల్ అయిపోతుంది” అని చెప్పుకోవచ్చు. అసలు ఇప్పుడ బాషా డైలాగ్ కి , సోషల్ మీడియాకి లింక్ పెట్టి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సొస్తుందంటే…మాజీ IAS,లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అయింది.దానిపై రకరకాల మీమ్స్, ట్రోల్స్ ,కామెంట్స్ నిమిషాల్లో శేర్ అయిపోయాయి.
Video Advertisement
ఆ వీడియోలో జయప్రకాష్ నారాయణ్ ఒక టివి ఛానెల్ కి సంబంధించిన లైవ్ ప్రోగ్రామ్లో ఉన్నారు. ఇంతలో వెనుక నుండి వాళ్లావిడ లైవ్ లోకి రావడంతో అందరికి అదొక హాస్య సన్నివేశంగా మారింది. ఒకటి రెండు సార్లు కాదు , పదేపదే ఆవిడ లైవ్ లో ఉన్న జెపిని డిస్టర్బ్ చేయడంతో ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇదే విషయంపై జెపి వివరణ ఇచ్చారు. ట్విటర్ వేధికగా అసలేం జరిగిందో చెప్తూ ట్వీట్ చేశారు.
వీడియో ప్లే అయిన కాసేపటికే రకరకాల ట్రోల్స్ , కామెంట్స్ స్టార్టయ్యాయి. వర్క్ ఫ్రం హోం చేస్తే ఉండే ఇబ్బందులు ఇవేనంటూ కొందరు ట్రోల్ చేస్తే, ఎంత పెద్ద లీడర్లైనా ఇల్లాలి పోరు తప్పదని మరికొందరు కామెంట్ చేశారు..ఇదే విషయంపై జెపి చేసిన ట్వీట్ ఏంటంటే “ఛానెల్స్ మధ్య పోటీ వలన ఇలాంటి పరిస్థితి ఎదురైంది . నేను ఒక ఛానెల్ కి సంభందించిన లైవ్ లో ఉండగా మరో ఛానెల్ వాళ్లు కావాలనే మా వైఫ్ కి కాల్ చేసి వాయిస్ సరిగా రావట్లేదని చెప్పడంతో, ఆవిడ నన్ను డిస్టర్బ్ చేసారు .అది కాస్తా హాస్యాభరితమైన అంతరాయాన్ని కలిగించింది. అంతరాయం కలిగించినందుకు ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పతున్నాను” అంటూ ట్వీట్ చేశారు జయప్రకాష్ నారాయణ్.
The perils of competing channels and working digitally from home! While I was on live tv, a competing channel bullied my long-suffering wife to interrupt me, claiming that my voice was not audible. Hence the humorous interlude. My apologies to viewers. https://t.co/m18wNUR7bg
— Jayaprakash Narayan (@JP_LOKSATTA) April 15, 2020
End of Article