Ads
స్వర్గీయ నందమూరి తారక రామ రావు గారి మరణం తరువాత అంతటి నటనా చాతుర్యం గల నటుడు చాల కాలం వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎవరు ఆ లోటుని పూడ్చలేకపోయారు సరిగ్గా 6 సంవత్సరాల తరువాత మన తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం అయ్యారు jr ఎన్టీఆర్ నందమూరి నట వారసుడిగా అడుగు పెట్టి ఆనతికాలం లోనే ఎంతో ఎత్తుకు ఎదిగారు అల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు..నటన లోనే కాదు డాన్స్,పాటలు పాడటం కూడా తారక్ ఎంతో ప్రావీణ్యం చెందారు.
Video Advertisement
“నీకు ఓటమా? నీకున్న బలం తోనే నువ్వు అనుకున్నది సాదిస్తావు..నటన నీకున్న బలం.నాట్యం నీకున్న వరం..నువ్వు కాలు కదిపితే ఆంధ్ర దేశం విజిలేసి ఎగురుతుంది. ఇవి యమ దొంగ లో jr ఎన్టీఆర్ కోసం రాసిన డైలాగ్స్ ఇవి నిజంగా ఆయనకు బాగా సరిపోతాయి. కొందరు హీరోలు బాగా నటించగలరు,ఇంకొందరు బాగా డాన్స్ చెయ్యగలరు,ఫైట్స్ చెయ్యగలరు,..తారక్ ఇవన్నీ కూడా చెయ్యగలరు అయన ఒక గొప్ప సింగర్ కూడా (నాన్నకు ప్రేమతో,రభస,కంత్రి) సినిమాలో పాడారు.
అది ఒక సెంటిమెంటల్ సీన్ కావచ్చు,కామెడీ సీన్ కావచ్చు,అది ఏ సీన్ అయినా ఎన్టీఆర్ సింగల్ టేక్ లో చెయ్యగల సత్తా ఉన్న ఏకైక నటుడు ఎన్టీఆర్.డైలాగ్ డెలివరీ లో ఆయన్ని సరి తూగే వారు ఇండస్ట్రీ లోనే మరెవరు లేరు ఆనంది జగమెరిగిన సత్యం.ఇవాళ
ఎన్టీఆర్ బర్త్డే సందర్బంగా ఎన్టీఆర్ గారి గురించి మీకు తెలియని కొన్ని విషయాలు మీకోసం.!
1 . నందమూరి హరికృష్ణ,షాలిని గార్లకి ఎన్టీఆర్ గారు మే 20 1983 వ సంవత్సరం లో జన్మించారు.
2 . తన 13 వ ఏట ‘భ్రహ్మర్షి విశ్వామిత్ర’ తాత గారి సినిమా షూటింగ్ లో మొట్టమొదటి సారి కలిశారు.తన అసలు పేరు ‘తారక్’ కానీ ఎన్టీఆర్ గారు తన పేరుని నందమూరి తారక రామారావు గా మార్చారు.
3 .ఎన్టీఆర్ గారి అక్క పేరు సుహాసిని నందమూరి కళ్యాణ్ రామ్ గారి తోబుట్టువు.
4 .ఎన్టీఆర్ తన విద్యాబ్యాసాన్ని ‘విద్యారణ్య హై స్కూల్’ , హైద్రాబాద్ లో చదివారు.
5 .తన ఇంటర్మీడియేట్ విద్యాబ్యాసాన్ని హైద్రాబాద్ లోని st .మేరీస్ కళాశాలలో చదివారు.
6 .తన చదువుని ఇంటర్మీడియట్ తో ముగించారు.
7 .తన 15 వ ఏట ‘బాల రామాయణం’ సినిమా లో నటించారు ఈ సినిమాని గుణశేఖర్ దర్శకత్వం వహించారు.
8 .స్టూడెంట్ no 1 సినిమాలో నటిచినప్పుడు కేవలం ఎన్టీఆర్ వయస్సు 17 సంవత్సరాలు మాత్రమే..ఈ సినిమాని ప్రముఖ దర్శకులు ss రాజమౌళి దర్శకత్వం వహించగా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది.
9 .స్టూడెంట్ no 1 సినిమాకి ముందు నిన్ను చూడాలని సినిమాతో తెలుగు వెండి తెరకి హీరోగా పరిచయం అయ్యారు.ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోలేక పోయింది.
10 .ఎన్టీఆర్ గొప్ప కూచిపూడి డాన్సర్ కూడా ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.
11 బ్యాడ్మెన్షన్ & క్రికెట్ తారక్ అభిమానించే క్రీడలు
12 తారక్ ఇష్టమైన కలర్ తెలుపు
13 ఎన్టీఆర్ కి పుచ్చకాయ జ్యూస్ అంటే చాల ఇష్టం.
14 .తన ఫేవరేట్ సినిమా తాత గారు నటించిన ‘దాన వీర సూర కర్ణ’
15 .టాలీవుడ్ చరిత్రలోనే ఒక పెద్ద వేడుకగా నిలించింది ‘ఆంధ్రా వాలా’ ఆడియో లాంచ్
16 రాఖీ సినిమా తరువాత ఎన్టీఆర్ యమ దొంగ సినిమా కోసం 20 కేజీల బరువు కోల్పోయారు.
17 ఇటు టాలీవుడ్ లోనే కాదు ఎన్టీఆర్ సినిమాలని జపాన్ లో కూడా ఎంతో ఆదరిస్తారు.ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్ ని నామినేట్ అయ్యింది.
18 బాద్షా లోని సైరో సైరో పాటకి జపాన్ లో ఎంత క్రేజ్ ఉందొ మేరె చుడండి.
19 అభిమానులు తనని ఎంతగా ఇష్ట పడుతరో క్రింది వీడియో లోని కాలర్ మాటలని వినండి.
20 తారక్ గొప్ప ప్లే బ్యాక్ సింగర్ అదుర్స్,నాన్నకు ప్రేమతో,కంత్రి, సినిమాలలోనే కాదు కన్నడ లో కూడా గెలియా గెలయ అనే పాటని ‘చక్ర వ్యూహ’ సినిమాలో పాడారు.
21 .నవరత్న ఆయిల్,బోరో ప్లస్ ,మలబార్ గోల్డ్ ,జండూ బామ్ కి బ్రాండ్ అంబాసడర్ కూడా..
22 ఎన్టీఆర్ రెండు నంది అవార్డ్స్ తో పాటు,ఫిలిం ఫేర్ బెస్ట్ అవార్డు,సినీ మా అవార్డ్స్ సాధించారు.
23. 2012 ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 100 లిస్ట్ ఎన్టీఆర్ కి 12 ప్లేస్ సాధించారు.
24. 2009 వ సంవత్సరం లో కర్నూల్ వరదల్లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్ కి 20 లక్షల రూపాయలు తన వంతు సహాయంగా చేసారు.
25. 2014 లో వైజాగ్ ని అతలా కుతలం చేసిన హుదూద్ తుఫాన్…జరిగిన నష్టానికి 20 లక్షల రూపాయలు తన వంతు సహాయంగా ప్రకటించారు
26. 2015 సంవత్సరం లో కూడా చెన్నై వరద బాధితులకి తనవంతు సహాయం చేసారు.
27. 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ తరుపున ప్రచారం చేసారు.
28. 26 మర్చి 2009 ఎన్నికల ప్రచారం లో భాగంగా హైద్రాబాద్ కి తిరిగి వస్తుండగా ఖమ్మం వద్ద ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న వాహనానికి ఆక్సిడెంట్ జరిగింది.చికిత్స కోసం హైద్రాబాద్ లో ని కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు
29. మే 5 2011 లో మాదాపూర్ లోని హైటెక్స్ లో ఎన్టీఆర్ వివాహం స్టూడియో N ఛానల్ ఓనర్ శ్రీనివాస రావు…నారా చంద్రబాబు నాయుడు గారి బంధువు ఈయన కుమార్తె లక్ష్మి ప్రణతి గారితో జరిగింది
30 .22 జులై 2014 ఎన్టీఆర్ గారికి నందమూరి అభయ రామ్ జన్మించాడు.
31. ఎన్టీఆర్ గారి నివాసం బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 31 లో ఉంది.
32. ఎన్టీఆర్ గారు భద్ర,శ్రీమంతుడు,కిక్,ఆర్య వంటి హిట్ సినిమాలని రిజెక్ట్ చేసారు
https://youtu.be/gaadZIozGoA
33. ఎన్టీఆర్ గారు వంటలు కూడా చెయ్యగలరు.తన శ్రీమతికి ఎప్పుడు ఆరోగ్యం బాగోలేకున్నా ఎన్టీఆర్ స్వయంగా వంట చేస్తారు.
జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలుగు అడ్డా టీం తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు. కెరీర్ లో ఆయన ఇంకెంతో ఎదగాలని ఆశిద్దాం.
End of Article