“వెతుక్కోవలసిన అవసరం లేదు… పాడు చేయకుండా ఉంటే చాలు..!” అంటూ… “రావణాసురుడి” పై జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్..!

“వెతుక్కోవలసిన అవసరం లేదు… పాడు చేయకుండా ఉంటే చాలు..!” అంటూ… “రావణాసురుడి” పై జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్..!

by Mohana Priya

Ads

సినిమాలు అన్న తర్వాత కొన్ని సార్లు వివాదాలు రావడం సహజమైన విషయం. అయితే ఇటీవల వివాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన సినిమా ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా. సినిమా ట్రైలర్ ఎప్పుడు అయితే రిలీజ్ అయ్యిందో అప్పటి నుండి ఇప్పటివరకు సినిమాకి సంబంధించి ఏదో ఒక గొడవ అవుతూనే ఉంది.

Video Advertisement

సినిమా రిలీజ్ అయ్యే ముందు వచ్చిన ట్రైలర్ చూసిన ఎంతో మంది అప్పటికే చాలా కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. సరే ఏదో ఒక్క మంచి విషయం అయినా ఉండాలి కదా అన్నట్టు సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఆగుదాం అనుకున్నారు. కానీ సినిమా చూశాక ట్రైలర్ లో చూపించిన దాని కంటే ఇంకా ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి.

ఒకటి కాదు. రెండు కాదు. సినిమాలో చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అన్నిటికంటే ఎక్కువ కామెంట్స్ వస్తున్న ఒకటే ఒక విషయం. సైఫ్ అలీ ఖాన్ పోషించిన రావణాసురుడు పాత్ర రూపొందించిన విధానం. అసలు సైఫ్ అలీ ఖాన్ ని చూస్తే రావణాసురుడిలాగా అనిపించలేదు అని, అందుకు కారణం గెటప్ అంటూ కామెంట్స్ వచ్చాయి. దాంతో తెలుగులో అంతకుముందు రావణాసురుడి పాత్ర పోషించిన నటుల ప్రస్తావన ఇప్పుడు వస్తోంది.

Adipurush

అయితే జూనియర్ ఎన్టీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు చర్చల్లో నిలిచాయి. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో దాదాపు ఆరు సంవత్సరాల క్రితం మాట్లాడిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు బయటికి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ జై లవ కుశ సినిమాలో ఒక పాత్ర రావణాసురుడి పాత్ర ఆధారంగా రూపొందింది.

minus points in adipurush trailer

ఈ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని ఈ ఇంటర్వ్యూలో చెబుతూ, అసలు ఒక పాత్ర ,అది కూడా ఇలా పురాణాలకు సంబంధించిన రూపొందించిన పాత్రలు ఎలా ఉండాలి అనే విషయం పై మాట్లాడారు.ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, “పౌరాణికానికి సంబంధించిన పాత్రలు చేస్తున్నప్పుడు ఆ పాత్రల సమాచారం కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ అందులోని విషయాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు” అని అన్నారు.

అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపై ఇంకా మాట్లాడుతూ జై లవ కుశ సినిమా మొదలు అయ్యే ముందు జూనియర్ ఎన్టీఆర్ ఆనంద్ నీలకంఠన్ రాసిన అసుర అనే బుక్ చదివాను అని చెప్పారు. అందులో రావణుడు 18 లోకాలకు రాజు మాత్రమే కాకుండా, అసురులకి చక్రవర్తి కూడా. అంటే అన్ని లోకాలకు అధిపతి అయ్యాడు. అలా అవ్వడానికి ఆయనలో ఎంత నేర్పు ఉండాలి? అలాంటి వ్యక్తి కళ్ళు ఎలా ఉంటాయి? ఈ విషయాలన్నిటినీ తెలుసుకున్నాను అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ఇందులో ఇంకా మాట్లాడుతూ, “రావణాసురుడు ఎక్కడైనా నిలబడితే శత్రువు సైతం ఆయనని పొగిడేలాగా ఉండాలి. అలాంటి పాత్ర నేను చేసేటప్పుడు నేను ఎలా మాట్లాడాలి అనే విషయాలని తెలుసుకున్నాను” అని అన్నారు. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్లు అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ పాత్ర పై తీసుకున్న శ్రద్ధని మెచ్చుకుంటున్నారు.

watch video :


End of Article

You may also like