“పూరి జగన్నాధ్” తో పాటు… FLOP లో ఉన్నప్పుడు “జూనియర్ ఎన్టీఆర్” ఛాన్స్ ఇచ్చిన 7 డైరెక్టర్స్..!

“పూరి జగన్నాధ్” తో పాటు… FLOP లో ఉన్నప్పుడు “జూనియర్ ఎన్టీఆర్” ఛాన్స్ ఇచ్చిన 7 డైరెక్టర్స్..!

by Mounika Singaluri

Ads

సక్సెస్ లో ఉన్నోడికి మన ఇచ్చే విలువ, మర్యాద కొంచెం ఎక్కువే. అదే ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే మరీ ఎక్కువగా  ఉంటుంది. వరుసగా హిట్ కొడుతున్న డైరెక్టర్ ఇంటికెళ్లి మరీ, నాకు కూడా ఓ స్టోరీ రాయి మనం కలిసి చేద్దాం అంటారు హీరోలు.

Video Advertisement

అదే ఓ ఫ్లాప్ లేదా యావరేజ్ టాక్ వస్తే ఆ డైరెక్టర్ తో కలిసి సినిమా చేయాలి అంటే ఒకటి రెండుసార్లు ఆలోచిస్తారు. కొందరైతే కథ వినడానికి కూడా ఇష్టపడరు.

కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎందుకు భిన్నంగా సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కథ నచ్చితే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.
అందుకు ఉదాహరణలే కింద పేర్కొన్న సినిమాలు..

1. వంశీ పైడిపల్లి

వంశీ పైడిపల్లి తొలి సినిమా మున్నా. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా ఆడింది. అయితే చాలా గ్యాప్ తర్వాత వంశీ దిల్ రాజు బ్యానర్‌లో “బృందావనం” చేసాడు. వంశీకి యావరేజ్ డెబ్యూ ఉన్నా కూడా తారక్ ఛాన్స్ ఇచ్చి హిట్ కొట్టాడు.

2. మెహర్ రమేష్

మెహర్ రమేష్ కి కంత్రి సినిమాలో తారక్ ఫస్ట్ టైమ్ వర్క్ చేసాడు. ఈ సినిమా యావరేజ్ అయినా మళ్లీ ఛాన్స్ ఇచ్చాడు ఎన్టీఆర్ కానీ డైరెక్టర్ శక్తి సినిమాతో డిజాస్టర్ సినిమా ఇచ్చాడు.

3. పూరీ జగన్నాథ్

పూరీ జగన్నాథ్ కి టెంపర్ ముందు వరకు రోమియో, హర్ట్ ఎటాక్ వంటి వరుస ఫ్లాప్ లే ఉన్నాయి. చాలాకాలం తర్వాత తారక్, పూరీ కలిసి టెంపర్ సినిమా తీశారు. ఇది పెద్ద హిట్ అయింది.

4. సుకుమార్

సుకుమార్ మహేష్ బాబుతో చేసిన 1: నేనొక్కడినే ఒక పాఠంలాంటిది. ఈ సినిమాకి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి కానీ కమర్షియల్ గా ఫెయిల్ అయింది. ఐతే 1: నేన్నొకడినే తర్వాత తారక్ సుక్కుకి ఛాన్స్ ఇస్తే “నాన్నకు ప్రేమతో” వంటి హిట్ మూవీ వచ్చింది.

5. బాబీ

సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి ఫ్లాప్ తర్వాత బాబీ కి సినిమాలే రావు అనుకున్నారు. కానీ కట్ చేస్తే తారక్ బాబీకి ఛాన్స్ ఇచ్చాడు. జై లవ కుశ తారక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

6. త్రివిక్రమ్

పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ చేసిన అజ్ఞాతవాసి గురూజీ కెరీర్ లో డిజాస్టర్ మూవీగా నిలిచింది.
ఆ సమయంలో తారక్ త్రివిక్రమ్ ను నమ్మి “అరవింద సమేత” కి ఓకే చెప్పాడు. దీంతో త్రివిక్రమ్ మళ్లీ విజయాల బాట పట్టాడు.

7. కొరటాల శివ

మొన్న ఆచార్య తో ఫ్లాప్‌లు లేని కొరటాల కి పెద్ద డిజాస్టర్ వచ్చింది. కానీ జనతా గ్యారేజ్ లాంటి హిట్ ఇచ్చిన కొరటాల కి తారక్ మళ్లీ ఎన్టీఆర్ కు అవకాశం ఇచ్చాడు. ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.


End of Article

You may also like