Ads
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న మెడికల్ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ అంటూ ఇప్పటివరకు ఉన్న పేరు తొలగించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Video Advertisement
ఈ నేపథ్యం లో ఈ అంశం పై జూనియర్ ఎన్టీఆర్ తాజాగా స్పందించారు. “ఎన్టీఆర్ , వైస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైస్సార్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు.” అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.
ఆయన ట్వీట్ మీద భిన్న స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం మీద తెలుగుదేశాన్ని డిఫెండ్ చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారని, విమర్శల వర్షం కురిపిస్తారని టీడీపీ అభిమానులు భావించారు. కానీ ఎన్టీఆర్ అటు వైసీపీ అభిమానులను నొప్పించకుండా పేరు మార్చినంత మాత్రాన ఆయన స్థాయి పెరగదు, ఎన్టీఆర్ స్థాయి తరగదు అనే విధంగా ట్వీట్ చేయడంతో టీడీపీ అభిమానులు ఎన్ఠీఆర్ వైఖరి పై మండి పడుతున్నారు.
మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఈ అంశం పై స్పందించారు. “1986లో విజయవాడలో మెడికల్ యూనివర్శిటీ స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ లోని 3 ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య , విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న శ్రీ ఎన్టీఆర్ గారు ఈ మహావిద్యాలయనికి అంకురార్పణ చేశారు.
ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందింది మరియు లెక్కలేనన్ని నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులను దేశానికి అందించింది. తెలుగు రాష్ట్రాలలో వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు మార్చబడింది.
ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 25 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం నాకు బాధ కలిగించింది. కేవలం రాజకీయ లాభం కోసం చాలా మందికి భావోద్వేగాలతో ముడిపడివున్న ఈ అంశాన్ని వాడుకోవటం తప్పు. ,” అని కళ్యాణ్ రామ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.
వైద్యారోగ్య శాఖ మంత్రి శాసనసభలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పునకు సంబంధించి సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఎన్టీఆర్ పేరు తీసేసి… ‘వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ’గా మార్చాలని తీర్మానించుకుంది. ఇందుకు వీలుగా యూనివర్సిటీ చట్టాన్ని సవరిస్తూ ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు తయారుచేసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని 1986లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభించారు. ఎన్టీఆర్ మరణానంతరం దానికి ఆయన గుర్తుగా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా పేరు మార్చారు.
దాదాపుగా మూడు దశాబ్దాలకు పైగా ఎన్టీఆర్ పేరుతోనే ఈ యూనివర్సిటీ కొనసాగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం సడన్ గా ఈ విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ పేరు మార్చాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆ కుటుంబం ఎమ్మెల్యే, సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.
హెల్త్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్- వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడం దురదృష్టకరం అన్నారు. ఎన్టీఆర్ పేరును తొలగించడం తెలుగు జాతిని అవమానించడమే అని మండిపడ్డారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించడం నేను తీవ్రంగా ఖండిస్తున్నామని, అదే పేరు కొనసాగించాలని ఎన్టీఆర్ కుమారుడు రామ కృష్ణ ఒక వీడియో విడుదల చేశారు.
End of Article