Ads
ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తారు. దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది.
Video Advertisement
అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రకటనల్లో కూడా కనిపిస్తూ ఉంటారు. అంతకుముందు చాలా ప్రకటనల్లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన. ఇటీవల మెక్ డోనాల్డ్స్ అడ్వర్టైజ్మెంట్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ నటించారు. అయితే ఈ అడ్వటైజ్మెంట్ కోసం జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న పారితోషకం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
జూనియర్ ఎన్టీఆర్ ఈ అడ్వర్టైజ్మెంట్ కోసం 8 కోట్ల పారితోషకం తీసుకున్నారు అని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్- ఇండియన్ స్టార్. కాబట్టి ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది. ఇంక దేవర విషయానికి వస్తే జనతా గ్యారేజ్ తర్వాత మళ్లీ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి ఈ సినిమాకి పని చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాకి అనిరుధ్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రతి భాష నుండి కొంత మంది నటులని తీసుకున్నారు. కొంత మంది మలయాళ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కొంత మంది జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో డబుల్ యాక్షన్ చేస్తున్నారు అని అంటున్నారు.
అందుకు కారణం జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఈ సినిమా నుండి రెండు పోస్టర్స్ విడుదల అయ్యాయి. రెండిట్లో జూనియర్ ఎన్టీఆర్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. కాబట్టి రెండు పాత్రలు పోషిస్తారు ఏమో అని అంటున్నారు. కొంత మంది ఏమో జూనియర్ ఎన్టీఆర్ కి ఏదైనా ఫ్లాష్ బ్యాక్ లాంటిది ఉంటుందేమో అని కూడా అంటున్నారు. అందుకే లుక్స్ డిఫరెంట్ గా ఉన్నాయి ఏమో అని అంటున్నారు.
End of Article