Ads
కరోనా మహమ్మారి కారణం గా ఎవరికీ ఎవరు లేకుండా పోతున్నారు.. పిల్లలు చనిపోయినా.. తల్లి తండ్రుల చనిపోయినా ఎవరు ఏమి చేయలేక పోతున్నారు. చాలా మందికి కనీసం చివరి చూపు కూడా దక్కడం లేదు. తాజాగా.. వెస్ట్ గోదావరి జిల్లా ఖానాపురం నివాసి అయిన శీలం అరుణశ్రీ (31) హైదరాబాద్ లో బ్యూటీషియన్ గా పని చేస్తోంది. యూసుఫ్ గూడ సమీపం లో యాదగిరి నగర్ లో గత ఏడేళ్లుగా ఉంటోంది. ఆమె భర్త కు దూరం గా ఒంటరిగా నివసిస్తోంది.
Video Advertisement
గత కొంతకాలం గా ఆమెకు సుస్తీ చేసి బాధపడుతోంది. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున ఆమె ఈ లోకాన్ని వీడింది. అయితే.. విషయం తెలుసుకున్న పోలీసులు కన్నవారికి సమాచారం అందించారు. ఈ క్రమం లో కరోనా నేపధ్యం లో తమ రాకపోకలకు ఇబ్బంది కలిగిందని.. తమ ఊరు నుంచి అక్కడకు రావడానికి ఇబ్బంది అవుతుందని.. వచ్చి వెళ్ళడానికి తమవద్ద డబ్బు లేదని.. మీరే అంత్యక్రియలు జరిపేయాలని వారు పోలీసులని కోరారు. ఈ క్రమం లో ఆమె మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీ లో భద్రపరిచారు.
End of Article