Ads
సినిమాల్లో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇందులో కొన్ని పొరపాట్లని మాత్రం వాటిని పొరపాటు అనాలో లేకపోతే ఆ సినిమా టీం నిర్ణయం అనాలో మనకి తెలియదు. అలా ఒక క్వశ్చన్ మార్క్ తో వదిలేస్తారు. ఇలాంటిదే ఒక సినిమాలో జరిగింది. విషయం ఏంటంటే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా జులాయి.
Video Advertisement
ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కూడా టీవీ లో టెలికాస్ట్ అయినప్పుడు ఈ సినిమా ని చాలా మంది చూస్తారు. జులాయి సినిమాకి ఇప్పటికి కూడా అంత క్రేజ్ ఉంది. అయితే ఈ సినిమాలో హీరోకి, సోనూ సూద్ కి మధ్య వచ్చే ఫస్ట్ ఫైట్ మన అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఆ గొడవ తర్వాత హీరో వైజాగ్ వదిలి వెళ్లాల్సి వస్తుంది. కానీ మళ్లీ బిట్టు (సోనూ సూద్) హీరో ఎక్కడ ఉన్నా కనిపెడతాడు ఏమో అని, అప్పుడు హీరో పోలీస్ ఇన్స్పెక్టర్ అయిన రావు రమేష్ తో కలిసి ఒక ఐడియా వేస్తారు. హీరో తనకి యాక్సిడెంట్ అయినట్టు అందులో తన ప్రాణాలు కోల్పోయినట్టు పేపర్ లో ఒక ఫోటో వేస్తాడు. ఈ పేపర్ లోని ప్రకటన గమనించండి. హీరో పేరు నిజంగా అయితే రవీందర్ నారాయణ్.
కానీ పేపర్ మీద రవి కుమార్ అని ఉంది. ఇది పొరపాటు అయినా అయ్యుండొచ్చు. అంతే కాకుండా హీరో పేరు విలన్ కి తెలియకుండా ఉండడానికి మార్చి అయినా రాసి ఉండవచ్చు. ఇదే విషయంపై ఒక మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి కూడా నెటిజన్లు బహుశా విలన్ కి పేరు తెలియకుండా ఉండడానికి అలా రాసి ఉండొచ్చు అని, అది దర్శకుడి ఆలోచన అని కామెంట్స్ చేస్తున్నారు.
End of Article