జూన్ లో పరిస్థితి దారుణంగా ఉండబోతుందంట..! వైద్య నిపుణుల అంచనా ఇదే..!

జూన్ లో పరిస్థితి దారుణంగా ఉండబోతుందంట..! వైద్య నిపుణుల అంచనా ఇదే..!

by Anudeep

Ads

దేశంలో రోజురోజుకి కేసులు పెరిగిపోతున్నాయి..జూన్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతుందని హెచ్చిరస్తున్నారు నిఫుణులు..దీనికి లాక్ డౌన్ సడలించడమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. మన దగ్గర ఆర్ధిక పరంగా నష్టపోతున్నామని, ఇతరత్ర కారణాలు చెప్తూ ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలించాయి..కానీ ఇప్పుడు నిఫుణుల హెచ్చరికల ను బట్టి పరిస్థితి ఎలా ఉండబోతుందో ఊహించడానికే కష్టంగా ఉంది..

Video Advertisement

ప్రపంచ దేశాల్లో లాక్ డౌన్ సడలించగానే కేసులు పెరిగిన విషయం విదితమే..చైనాలోని వూహాన్ నగరం మూడు నెలల పాటు పూర్తి లాక్ డౌన్లో ఉండి, కరోనాని కట్టడి చేసాం అనుకొంది..కానీ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి..ఒక్క చైనా ఏమిటి..ఇరాన్ , దక్షిణ కొరియా, బ్రిటన్, స్పెయిన్ ఇలా అనేక దేశాలు ..కరోనా వ్యాపించకుండా లాక్ డౌన్ ప్రకటించుకుని..కేసులు తగ్గుముఖం పట్టేసరికి లాక్ డౌన్ సడలించాయి.. తీరా చూస్తే కేసులు సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇరాన్, బ్రిటన్ , స్పెయిన్ దేశాలు రెండోసారి కరోనా అటాక్ కి గురి కానున్నాయి.

ఇదిలా ఉండగా , మన దేశంలో ఆర్దిక పరమైన నష్టాలు సంభవిస్తున్నాయని లాక్ డౌన్లో సడలింపులు చేశారు..రెండు నెలల పాటు లాక్ డౌన్ పాటించినప్పటికి, రోజురోజుకి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది..ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే జూన్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అంటున్నారు అంటువ్యాధి నిఫుణులు తన్మయ్..ఈయన బీహార్ లో కేర్ ఇండియా సంస్థకి నాయకులుగా వ్యవహరిస్తున్నారు.

లాక్ డౌన్లో సడలింపులు ఇవ్వగానే ప్రజలు విపరీతంగా ప్రయాణాలు చేస్తున్నారని, సడలింపులకు అర్దం అది కాదని.. అత్యవసరం అయితే తప్ప బయటకి రావద్దంటున్నారు..ప్రస్తుతం పెరుగుతున్న కేసుల సంఖ్య చూస్తుంటే ఇది జూన్లో గననీయంగా పెరగొచ్చని..జూలై వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోవచ్చని హెచ్చరిస్తున్నారు..భారత్ ని పూర్తి లాక్ డౌన్ లో ఉంచడం అనేది అసాధ్యం,కాబట్టి ప్రజలే వారికి వారుగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు.


End of Article

You may also like