5 ఏళ్ల నుండి రిలేషన్ లో ఉన్నాము…పెళ్లి చేస్కుంటా అని చేసుకోకుండా మోసం చేస్తున్నాడు!

5 ఏళ్ల నుండి రిలేషన్ లో ఉన్నాము…పెళ్లి చేస్కుంటా అని చేసుకోకుండా మోసం చేస్తున్నాడు!

by Anudeep

Ads

“తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని” సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు పై సినీ ఆర్టిస్ట్ సాయి సుధా కేసు ఫైల్ చేసింది.. తెలుగు సినిమా పరిశ్రమలో చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా అందరికి సుపరిచితులే..తన తమ్ముడు శ్యామ్ కె నాయుడు కూడా సినిమాటోగ్రాఫర్ గా స్థిరపడ్డారు. ఎక్కువగా పూరి జగన్నాధ్ చిత్రాలకు సినిమాటోగ్రఫి అందించారు శ్యామ్..

Video Advertisement

బిజినెస్ మాన్, కెమెరామాన్ గంగతో రాంబాబు,గోలిమార్ లాంటి ఎన్నో హిట్ చిత్రాలకు సినిమాటోగ్రఫి అందించిన శ్యామ్ కె నాయుడుపై జూనియర్ ఆర్టిస్ట్ సాయి సుధా ఈ రోజు (మే 27న) ఎస్ ఆర్ నగర్ పోలీసుస్టేషన్లో తన కంప్లైంట్ ఫైల్ చేశారు.ఎవడే సుబ్రహ్మణ్యం, అర్జున్ దేవరకొండ మరికొన్ని సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో , కొన్ని షార్ట్ ఫిలింస్ లో నటించిన సాయిసుధ కేస్ ఫైల్ చేయడంతో పాటు వారిద్దరి బంధానికి సంబంధించి కొన్ని విషయాలను బయటపెట్టారు.

దాదాపు ఐదేళ్ల నుండి ఇద్దరం రిలేషన్ లో ఉన్నామని, తన దగ్గరకి రావడం ప్రపోజల్ తోనే వచ్చారని..నేను కూడా అంగీకరించానని ఒక న్యూస్ ఛానల్ తో చెప్పారు సాయిసుధా.మా ఇద్దరి రిలేషన్ శ్యామ్ కె నాయుడు ఇంట్లో వారికి, శ్యామ్ కె నాయుడు అన్నయ్య చోటా కె నాయుడుకి కూడా తెలుసు అని .. పెళ్లిచేస్కుంటాను అన్నారని చెప్పుకొచ్చారు..

శ్యామ్ కె నాయుడు కి ఇది వరకే పెళ్లి అయింది.. అదే విషయంపై సుధా శ్యామ్ కె నాయుడని ప్రశ్నిస్తే..తన కుటుంబంలో కలహాలున్నాయని, కాబట్టి నీతోనే ఉంటానన్నరాని అన్నారు..కానీ ఇప్పుడు పెళ్లిచేసుకోమని ఎంతగా అడిగినా రెస్పాన్స్ లేదన్నారు. కేస్ ఫైల్ చేస్తున్న విషయం వారికి తెలుసా అని ప్రశ్నించగా.. వారందరికి తెలుసు. పెళ్లిచేస్కోవట్లేదు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని శ్యామ్ కి, శ్యామ్ వాళ్ల వైఫ్ కి, చోటా కె నాయుడు కి ముగ్గురికి మెసేజ్ చేసానని..ఎటువంటి రిప్లై ఇవ్వలేదని..కేసు పెడతా  అంటే పెట్టుకోమని చోటా కె నాయుడు  అన్నారని ఇక ఈ స్టెప్ తీస్కోక తప్పలేదని అన్నారు.ప్రస్తుతం ఎస్సార్ నగర్ పోలీసులు కేస్ ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.


End of Article

You may also like