Ads
జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. తన నటనతో, డైలాగ్స్ తో, డాన్స్ తో ప్రేక్షకులని ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాడు.
Video Advertisement
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా లో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఎప్పుడూ కూడా తనదైన మార్క్ ను ఏర్పర్చుకున్నాడు ఎన్టీఆర్. అయితే జూనియర్ ఎన్టీఆర్ సీరియల్స్ లో నటించిన సంగతి చాలా మందికి తెలియదు.
అవును నిజంగానే ఎన్టీఆర్ సీరియల్స్ లో కూడా నటించాడు.పైగా ఆ సీరియల్ బాగా హిట్ కూడా అయింది. ఇక దాని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే… ఎన్టీఆర్ నటించిన ఆ సీరియల్ పేరు భక్త మార్కండేయ. అయితే ఇందులో ఎన్టీఆర్ నటించాడు అని చాలా మందికి తెలియదు.
ఈటీవీ మొదలుపెట్టిన కొత్తలో ఈ సీరియల్ వచ్చింది. ఈ సీరియల్ లో ఎన్టీఆర్ మార్కండేయుడి పాత్ర చేశాడు. శివ భక్తుడు గా ఎన్టీఆర్ నటించి ప్రశంసలు పొందాడు. ఈ గెటప్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
End of Article