Ads
తెలుగు చిత్రసీమను అభిమానించే ప్రేక్షకులు మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు సౌందర్య. తెలుగు, తమిళం, మలయాళం,హిందీ భాషల్లో 120కి పైగా సినిమాలు చేశారు సౌందర్య. 2004వ సంవత్సరం ఏప్రిల్ నెలలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు సౌందర్య.
Video Advertisement
అసలు విషయం ఏమిటంటే మనిషిని పోలిన మనుషులు ప్రపంచం మొత్తం మీద ఏడుగురు ఉంటారు అంటారు మన పెద్దలు. మన పోలికలతోనే ఉన్న వారు ఎప్పుడైనా మన కంట పడితే ఆశ్చర్యానికి లోనవుతాము.
ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటివి విచిత్రాలు ఎన్నో జరుగుతున్నాయి. మన సినీనటులుని పోలి ఉన్న ఎంతోమంది వ్యక్తులు మనకీ సోషల్ మీడియా ద్వారా దగ్గరవుతున్నారు.
మన హీరో హీరోయిన్ లాగా పోలిన వారు ఎంతోమంది వాళ్లలాగే తయారవుతూ, డైలాగులు, పాటలు పర్ఫామెన్స్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటున్నారు.
ఇప్పుడు అదే విధంగా హీరోయిన్ సౌందర్యలా ఒక యువతి సోషల్ మీడియాలో అందరి చూపుని ఆకర్షిస్తుంది. ఈవిడ అచ్చు సౌందర్య రూపురేఖలు కూడా కలిగి ఉంది. ఈమె చేసే వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె నటన, హావభావాలు సౌందర్య గారు అలాగే ఉన్నాయంటూ ఆమె ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
సౌందర్యాన్ని పోలి ఉండే ఈ యువతి పేరు చిత్ర. ఈమె మలేషియ లో జన్మించారు. సౌందర్య చేసిన చిత్రాలలో ఆమె హావభావాలు ఏవిధంగా ఉంటాయో అదే విధంగా చిత్ర కూడా హావభావాలను ఇస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది.
తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా వీడియోలు పోస్ట్ చేస్తూ లక్షకుపైగా అభిమానులను సంపాదించుకుంది. ఈ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు సౌందర్య మళ్ళీ పుట్టింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈమె నటనకు గాను మంచి ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. చిత్రాల్లో నటించే అవకాశం వస్తే నటిస్తుందా,లేదా అనేది వేచి చూడాలి.
https://www.instagram.com/reel/Cegk-B5JUKn/?igshid=YmMyMTA2M2Y=
End of Article