చైనా నుండి కర్నూల్ తిరిగొచ్చిన జ్యోతి బయటపెట్టిన సంచలన విషయాలు ఇవే..! అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే?

చైనా నుండి కర్నూల్ తిరిగొచ్చిన జ్యోతి బయటపెట్టిన సంచలన విషయాలు ఇవే..! అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే?

by Anudeep

కరోనా భయం రోజురోజుకి పెరిగిపోతోంది. ఇప్పటికే స్కూల్స్ , కాలేజిలకు సెలవులు ప్రకటించేశారు. థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసేశారు. వ్యాది. చైనా లో పరిస్థితి భయంకరంగా ఉందనేది టివిల్లో చూస్తుంటేనే, వార్తల్లో చదువుతుంటేనే మనకి భయం వేస్తోంది. అలాంటిది కరోనా సోకిందనే కారణం చేత చైనాలో చిక్కుకుపోయిన వాళ్ల పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. కర్నూలుకి చెందిన జ్యోతిని అడిగితే తెలుస్తుంది.

Video Advertisement

చైనాలోని వ్యూహాన్లో చిక్కుకుపోయిన జ్యోతి ఎట్టకేలకు  భారత్ చేరుకుంది. చైనా నుండి భారత్ కి రావడం అంత సింపుల్ గా జరిగిపోలేదు. ఎన్నో వ్యయప్రయాసల నడుమ జ్యోతిని ఇండియాకి తీసుకొచ్చారు . రాజధాని ఢిల్లీలో పదిహేను రోజుల పాటు వైధ్యల పరీక్షల అనంతరం కర్నూలుకి తీసుకొచ్చారు.

ఇటీవల సాఫ్ట్వేర్ ఉద్యోగానికి సెలక్ట్ అయిన జ్యోతి ట్రెయినింగ్ నిమిత్తం చైనాకు వెళ్లింది.కరోనా వ్యాప్తితో చైనాలోని వ్యూహాన్లో పరిస్థితి దారుణంగా ఉండడంతో, ఇండియాకి వచ్చేస్తున్నానని కుటుంబానికి కాల్ చేసి చెప్పింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి కూడా ఉండడంతో అమ్మాయి వచ్చేస్తుందని జ్యోతి  కుటుంబ సభ్యులు , కాబోయే భర్త అమర్ నాధ్ రెడ్డి సంతోషించారు.

కాని ఇండియా రావడానికి విమానశ్రయానికి చేరుకున్న జ్యోతిని తీసుకెళ్లడానికి ఎయిరిండియా విమానాలు నిరాకరించాయి. ఎయిర్పోర్ట్ లో చెకప్ చేయగా బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉండడంతో కరోనా లక్షణాలున్నట్టుగా గుర్తించారు. చైనా నుండి భారతీయులను తీసుకు రావడానికి వెళ్లిన రెండు ఎయిరిండియా విమానాలు తిరిగి వచ్చేశాయి. మరి కొద్ది గంటల్లో కుటుంబ సభ్యులని కలుస్తాననుకున్న జ్యోతి ఆశలు ఆవిరయ్యాయి.

తనతో ఉన్న వాళ్లు వెళ్లిపోయారు, తాను వెళ్తుందో లేదో తెలియదు. దాంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన జ్యోతి , ఒక సెల్ఫి వీడియో చేసి భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. కూతురి పరిస్థితి చూసిన జ్యోతి పేరెంట్స్, కాబోయే భర్త అమరనాధ్ రెడ్డి కూడా భారతప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడంతో ఎట్టకేలకు అన్నెం జ్యోతిని అందరితో పాటు ఇండియా తీస్కొచ్చారు.

ఇండియా వచ్చిన తర్వాత ఢిల్లీలోని మానేసూర్ లో క్వారెంటైన్ లో పెట్టారు. వైధ్యుల పర్యవేక్షనలో ఉంచారు. మనతో పాటు ఉండే వాళ్లందరూ వెళ్లిపోతున్నారు , తినడానికి ఫూడ్ కూడా సరిగా లేదు.  పచ్చడి, జామ్, బ్రెడ్ ఇలా ఏదుంటే అది  ఉన్నదాంతోనే సరిపెట్టుకునేదాన్ని . అలాంటి పరిస్తితి ఎవరికి రావొద్దు , అసలోస్తానో లేనో అని భయపడ్డానంటూ కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది . ప్రత్యక్షంగా అక్కడ పరిస్థితిని వివరిస్తున్న జ్యోతి చెప్పేది వింటుంటే మనకి కూడా కన్నీళ్లొస్తాయి.


You may also like

Leave a Comment