ఆర్మీ అధికారిని కాపాడే క్రమంలో చేయి కోల్పోయారు జ్యోతి…ఆ ప్రమాదమే ఆమె జీవితాన్ని మార్చేసింది.?

ఆర్మీ అధికారిని కాపాడే క్రమంలో చేయి కోల్పోయారు జ్యోతి…ఆ ప్రమాదమే ఆమె జీవితాన్ని మార్చేసింది.?

by Mohana Priya

Ads

ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరుగుతూ ఉంటే, కొంత మంది తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వెళ్లి ఆ ప్రమాదం బారిన పడకుండా ఎంతో మందిని రక్షిస్తారు. వారిలో ఒకరు జ్యోతి. జ్యోతి దంతెవాడకు చెందిన వారు. 2010 లో జ్యోతి నర్సింగ్ చదువుతున్నారు. జనవరి 3వ తేదీన హాస్టల్ నుండి ఇంటికి బస్ లో బయలుదేరారు. అదే బస్సులో వికాస్ కూడా ఉన్నారు.

Video Advertisement

వికాస్ కేరళలోని పాలక్కాడ్ కి చెందినవారు. అక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తున్నారు. వికాస్ విండో సీట్ దగ్గర కూర్చున్నారు. విండో కడ్డీల మీద తలవాల్చి నిద్రపోతున్నారు. వికాస్ వెనకాల జ్యోతి కూర్చుని ఉన్నారు. అంతలో ఒక లారీ అదుపుతప్పి వేగంగా వస్తోంది. లారీ విండో వైపు రావడం గ్రహించిన జ్యోతి వికాస్ ని లాగారు.

ఇందులో జ్యోతి చేతికి బలమైన దెబ్బ తగిలి కుడి చేయి కుడి భుజం దిగువ వరకు తొలగించారు. తనకి పునర్జన్మను ఇచ్చిన జ్యోతిని ప్రేమించారు వికాస్.  జ్యోతి కూడా వికాస్ ని ప్రేమించారు. కానీ జ్యోతి తండ్రి వీరి ప్రేమని అంగీకరించలేదు. జ్యోతి ఇల్లు విడిచి పాలక్కాడ్ కి వెళ్లిపోయారు. 2011 లో జ్యోతి, వికాస్ పెళ్లి చేసుకున్నారు. వికాస్ ఉద్యోగరీత్యా దేశమంతటా ప్రయాణిస్తూ ఉన్నా, జ్యోతి పాలక్కాడ్ లో నివసిస్తున్నారు.

వారికి ఇద్దరు పిల్లలు. ఒక బాబుకి 8 సంవత్సరాలు ఇంకొకరికి 4 సంవత్సరాలు. కేరళ స్థానిక ఎన్నికల్లో సరైన మహిళా అభ్యర్థుల కోసం వెతుకుతున్న పార్టీ, జ్యోతిని సంప్రదించడంతో జ్యోతి సరే అన్నారు. జ్యోతి  పాలక్కాడ్‌లో కొల్లన్‌గోడే బ్లాక్‌ నుంచి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.


End of Article

You may also like