Ads
కళాతపస్వి కె.విశ్వనాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తెర మీదకి ఎన్నో చక్కటి సినిమాలని తీసుకు వచ్చారు. ఇటు తెలుగు లోనే కాకుండా అటు హిందీ సినిమాలు కూడా తీసుకు వచ్చారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మరచిపోలేని సినిమాలని తీసుకు రావడం అంటే మామూలు విషయమా..? అలానే కె.విశ్వనాథ్ గారు చక్కటి సినిమాలతో అవార్డులు, రివార్డులుని కూడా అందుకున్నారు.
Video Advertisement
దాదాపు ప్రతీ మూవీ కి కూడా ఏదో ఓ అవార్డు వచ్చింది. పైగా స్టార్ హీరోలు కూడా ఎప్పుడు కమర్షియల్ గా ఆలోచించకుండా ఆయన సినిమా చేసేందుకు ఎదురు చూసేవాళ్ళు.
సూపర్ కల్ట్ క్లాసిక్స్ లాంటి సినిమాలతో కె.విశ్వనాథ్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు. విశ్వనాథ్ గారు 1980 లో తీసుకు వచ్చిన శంకరాభరణం అయితే ఎప్పటికి మరచిపోలేని సినిమా. అలానే ఎంతో మంచి సినిమా. ఈ సినిమా అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా. అలానే నేషనల్ అవార్డు గెలుచుకున్న సినిమా ఇది.
ఈ సినిమా చాలా మందికి ఫేవరెట్ కూడా. ఈ చిత్రం లో సోమయాజులు, మంజు భార్గవి, చంద్రమోహన్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా కి కెవి. మహదేవన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2, 1980 లో విడుదల అయ్యింది. ఫిబ్రవరి 2 న ఈ సినిమా విడుదల అవ్వడం.. అలానే ఫిబ్రవరి రెండునే ఆయన తిరిగిరాని లోకాలకి వెళ్లిపోవడం జరిగింది.
ఇక విశ్వనాధ్ గారి సినిమాల విషయానికి వస్తే.. శంకరాభరణం సినిమా ఏ కాకుండా సాగర సంగమం, స్వాతిముత్యం ఇలా చాలా చక్కటి సినిమాలని ఆయన తీసుకువచ్చారు. ఆయన తీసుకువచ్చిన స్వర్ణకమలం సినిమా కూడా బాగుంటుంది. ఈ సినిమాలో వెంకటేష్ భానుప్రియ చాలా చక్కగా నటించారు .స్వయంకృషి సినిమా కూడా చాలా బాగుంటుంది. ఇది మంచి కుటుంబ కథా చిత్రం. కె.విశ్వనాథ్ గారు తీసుకువచ్చిన శుభలేఖ, సిరివెన్నెల సినిమాలు కూడా బాగుంటాయి.
1992లో వచ్చిన స్వాతికిరణం సినిమా కూడా చాలా బాగుంటుంది. రాజశేఖర్, సుమలత కలిసి నటించిన శృతిలయలు సినిమా కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాకి గాను విశ్వనాథ్ గారికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. శుభసంకల్పం సినిమా కూడా బాగుంటుంది. అలానే ఆపద్బాంధవుడు, సప్తపది, సిరిసిరిమువ్వ సినిమాలకి కూడా విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు.
End of Article