Ads
కైకాల సత్యనారాయణ అందరికీ సుపరిచితమే. నవరస నట సార్వభౌమ బిరుదాంకితులు కైకాల సత్యనారాయణ పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వివిధ రకాల పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. కరుణ రసం, కామెడీ, భయం ఇలా ఏ పాత్రలో అయినా నటించగలిగే నటుడు కైకాల సత్యనారాయణ.
Video Advertisement
యమగోల చిత్రంలో యముడి పాత్రకు వన్నెతెచ్చిన కైకాల సత్యనారాయణ ఆ తర్వాత మరి కొన్ని సినిమాల్లో కూడా యముడిగా నటించారు. 1977లో వచ్చిన యమగోల చిత్రం ఎన్టీఆర్ కి ఎంత పేరు తెచ్చిందో… యముడు పాత్ర చేసిన కైకాల సత్యనారాయణకు అంతే పేరు తీసుకొచ్చింది.
యముడు అంటే ఇలా ఉంటాడా అని అందరిని మైమరిపించారు కైకల సత్యనారాయణ. మెగాస్టార్ చిరంజీవి యముడికి మొగుడు చిత్రం లో కూడా సత్యనారాయణ యముడి పాత్ర చేశారు. అలానే ఎస్ వి కృష్ణా రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన యమలీల చిత్రం లో కూడా యముడిగా కైకాల సత్యనారాయణ అద్భుతంగా నటించారు. ఇవి మంచి పేరు తెచ్చి పెట్టడంతో ఆయనకు యముడిగా చాలా సినిమాల్లో అవకాశం వచ్చింది. దాదాపు పదుల సంఖ్యలో సినిమాలలో ఆయన యముడిగా నటించారు.
End of Article