నువ్వు నిజంగా గ్రేట్ కాజల్ ! ఎన్నో ఏళ్లుగా తను చేస్తున్న ఈ మంచిపనికి పబ్లిసిటీ కూడా లేదు.!

నువ్వు నిజంగా గ్రేట్ కాజల్ ! ఎన్నో ఏళ్లుగా తను చేస్తున్న ఈ మంచిపనికి పబ్లిసిటీ కూడా లేదు.!

by Anudeep

Ads

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు చిత్రసీమకి పరిచయం అయిన కాజల్ అగర్వాల్ చందమామతో అందరికి చేరువయింది. యువ హీరోలతో పాటు మెగస్టార్ చిరంజీవి సరసన కూడా నటించి పేరు తెచ్చుకుంది . తెలుగులో అత్యదిక వసూళ్లు రాబట్టిన మగధీర సినిమా కాజల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ .“క్యుం హో గయా నా “ అనే బాలివుడ్ చిత్రంలో చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది. అందులో ఐశ్వర్యరాయ్ ఫ్రెండ్ గా నటించింది కాజల్ . తర్వాత తెలుగులో “లక్ష్మీ కళ్యాణం “ అవకాశం రావడంతో నటించి , ఇక్కడే సెటిల్ అయిపోయింది. తెలుగుతో పాటు , తమిళంలో కూడా స్టార్ హీరోలందరి సరసన నటించింది.

Video Advertisement

 

తమిళ స్టార్ హీరో సూర్య సరసన నటించిన సింగం సినిమాతో బాలివుడ్ కి తిరిగి పరిచయం అయింది , ఆ సినిమా హిట్ ,అంతేకాదు బాక్సాఫీస్ హిట్ అయిన స్పెషల్ 26 లో కూడా నటించింది. కానీ తెలుగు,తమిళంలో వచ్చినంత గుర్తింపు రాకపోవడంతో మళ్లీ బాలీవుడ్ నుండి వెనుదిరిగింది.

 

ఇటీవల సింగపూర్ కి చెందిన మేడమ్ టుస్సాడ్ప్ మ్యూజియంలో కాజల్ అగర్వాల్ మైనపు బొమ్మని ప్రదర్శించారు.ఇలాంటి అరుదైన అవకాశం కొద్దిమందికి మాత్రమే లభిస్తుంటుంది. అందులో కాజల్ అగర్వాల్ ఒకరు. తన దశాబ్దం కెరీర్లో ఎన్నో సక్సెస్లు, ఫెయిల్యూర్స్ చూసిన కాజల్ ఎన్నో అవార్డులని సొంతం చేసుకుంది.నేటి సమాజం లోని మనుషులు ఎలా ఉన్నారంటే చెయ్యని పని కూడా చేశామని..చేసిన పని కూడా చెయ్యలేదని ..ఒక్క రూపాయి సేవ చేసి పది రూపాయల పబ్లిసిటీ ఇచ్చుకునే ఈ రోజుల్లో..కాజల్ ఎన్నో ఏళ్ళ్లుగా గిరిజన పిల్లకు చేస్తున్న సహాయం ఎక్కడ ఎప్పుడు ఎవరితో చెప్పుకోలేదు.వైజాగ్ లోని అరకు వ్యాలీ లో థింక్ పీస్ అనే స్వచ్చంధ సంస్థతో కలిసి సేవ చేస్తున్నారు.వారికోసం ఒక స్కూల్ కూడా నిర్మించి ఇచ్చారట అంతే కాదు ఎంత బిజీ గా ఉన్న వారి కోసం సమయం కేటాయిస్తూనే ఉంటుంది.

వాళ్లకు పాఠాలు కూడా చెబుతుంటారట.అంతే కాదండోయ్ గిరిజన పిల్లల కోసం NRI ల నుంచి కూడా సహాయం చేయమని అడిగారట.అక్కడ ఉన్న గిరిజన ఆడ పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందట.ఎంత చేస్తున్న సోషల్ మీడియా లో కానీ మరెక్కడా కానీ కొంచెం కూడా పబ్లిసిటీ ఇచ్చుకోలేదు.నిజంగా నువ్ గ్రేట్ కాజల్..ఇలాంటి బర్త్ డేస్ ఎన్నో సెలెబ్రేట్ చేసుకోవాలి.

 


End of Article

You may also like