రెండు రోజుల్లో మీరే నా తొలి కస్టమర్…కన్నీళ్లు పెట్టిస్తున్న కాజల్ పోస్ట్.! దయచేసి డబ్బులివ్వండి..

రెండు రోజుల్లో మీరే నా తొలి కస్టమర్…కన్నీళ్లు పెట్టిస్తున్న కాజల్ పోస్ట్.! దయచేసి డబ్బులివ్వండి..

by Anudeep

Ads

కరోనా వైరస్ వ్యాపించకుండా  అవగాహన కల్పించడానికి సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు. కాని కాజల్ అగర్వాల్ పెట్టిన పోస్టు అందరిని కంటతడి పెట్టిస్తోంది. అంతేకాదు అందరని ఆలోచనలో పడేసింది. ఇంతకు ముందు కరోనా నుండి కాపాడుకోవడానికి ఏ విధంగా శుభ్రత పాటించాలో పోస్టు చేసిన కాజల్ , ఇప్పుడు ఒక నిజజీవిత  సంఘటనని పోస్టులో శేర్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవతున్న పోస్టు యధాతదంగా.

Video Advertisement

“క్యాబ్ డ్రైవర్ నా ముందు నిల్చుని ఏడ్చాడు . గడిచిన రెండు రోజుల్లో మీరే నా తొలి కస్టమర్ . నా భార్య ఈ రోజైనా నేను సరుకులు తెస్తానా  అని ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాదు చివరి కస్టమర్ ని దించేసాక 70 కిలో మీటర్లు వెనక్కి  ఖాళీగానే  వెళ్లాల్సి వచ్చింది అంటూ చెప్తూ ఏడ్చాడు. అతను చెప్పింది వినగానే నాకు చాలా బాధ కలిగింది. దాంతో 500 రూపాయలు ఎక్కువగా ఇచ్చాను . మీరే అతని చివరి కస్టమర్ కావొచ్చు” అనే పోస్టుని ఒకతను శేర్ చేసాడు.

ఈ పోస్టు చూసిన కాజల్ పోస్టు చలించిపోయింది.  వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే అందరూ కొన్న జాగ్రత్తలు పాటించాలని చెప్పాం. దీనితో చాలా మంది చిన్న చిన్న పనులు చేసుకునే వారి జీవితాలు అస్తవ్యస్తం అయిపోతున్నాయి. కాబట్టి అలాంటి వారు మీ చుట్టుపక్కల ఉంటే దయచేసి కొంచెం ఎక్కువ డబ్బలు ఇవ్వండి అంటూ ఫ్యాన్స్ ని కోరింది.కాజల్ చేసిన పోస్టు కి ఫ్యాన్స్ , నెటిజన్లు  ప్రశంసల్లో ముంచెత్తడమే కాదు., మేం కూడా అలాగే చేస్తాం అని కామెంట్ చేస్తున్నారు.

కొన్ని  నెలలుగా కరోనా భూతానికి ప్రపంచం అంతా వణికిపోతున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ వ్యాప్తి చెందించకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో మన రోజువారి కార్యక్రమాలు ఎక్కడిక్కడ నిలిపివేసి, ఇంటిపట్టునే ఉండాలని ప్రభుత్వాలు సూచించాయి. చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇచ్చేశాయి. ప్రజలు చాలామంది తమ సోషల్ లైఫ్ కి దూరంగా ఉన్నారు. కాని  దీనివల్ల ఎందరో రోజువారి పనులు చేసుకునే వారి జీవితాలు చిన్నాబిన్నం  అవుతున్నాయనడానికి ఇదే ఉదాహరణ.


End of Article

You may also like