Ads
కాజల్ అగర్వాల్ గురించి పరిచయం చెయ్యక్కర్లేదు. లక్షీ కళ్యాణం సినిమా తో ఈమె తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది.
Video Advertisement
ఆ తరవాత కాజల్ ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఈమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో కాజల్ కి ఒక రేంజ్ లో ఫాలోయింగ్ ఉండేది.
ఈమె ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. కాజల్ ప్రెగ్నెన్సీ రూమర్స్ పై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వినపడుతున్నాయి. కాజల్, గౌతమ్ కిచ్లు కలిసి పిల్లలను ప్లాన్ చేస్తున్నారని.. ఆమె ప్రెగ్నెంట్ అని వార్తలు తెగ షికార్లు కొడుతున్నాయి.
దీనిపై తాజాగా కాజల్ అగర్వాల్ స్పందించి ఇలా అంది. సరైన సమయంలో దాని గురించి మాట్లాడతా అని చెప్పింది. రూమర్లపై వస్తున్న సస్పెన్స్ కి ఈమె మరి కొంచెం సస్పెన్స్ ని పెట్టింది. అయితే నిజంగా ఆమె గర్భవతి కాకపోతే అలాంటిదేమీ లేదు అని జవాబు వచ్చేది. కానీ ఈమె సరైన సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ అభిమానుల్లో మరింత అనుమానం రేపింది.
End of Article