కల్కి 2898 ఏడి కంటే ముందే… ఈ నటుడు నటించిన ఫేమస్ సినిమా ఏదో తెలుసా..? ఈయన ఎవరంటే..?

కల్కి 2898 ఏడి కంటే ముందే… ఈ నటుడు నటించిన ఫేమస్ సినిమా ఏదో తెలుసా..? ఈయన ఎవరంటే..?

by Harika

Ads

ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే సినిమా గురించి మాట్లాడుతున్నారు. అదే ప్రభాస్ హీరోగా నటించిన ప్రాజెక్ట్ కే అలియాస్ కల్కి 2898 ఏడి. సినిమాలో భారీ తారాగణం ఉంది. అంతకంటే భారీ బడ్జెట్ తో సినిమాని కూడా తెరకెక్కించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడే మరొక సినిమా ఇది అవుతుంది అని ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన వీడియోలు చూస్తుంటే అర్థం అవుతోంది. రేపు ఈ సినిమా విడుదల అవుతుంది. ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరితో పాటు టీజర్ లో దృష్టిపడిన మరొక నటుడు పశుపతి. పశుపతి తమిళ నటుడు.

Video Advertisement

kalki 2898 ad actor previous movie

అయినా కూడా తెలుగులో గుర్తింపు పొందారు. తెలుగులో కొన్ని సినిమాల్లో మాత్రమే పశుపతి నటించారు. కానీ ఆయన నటనకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. ఒకరకంగా చెప్పాలి అంటే టీజర్ లో అందరి కంటే ఎక్కువ పశుపతి హైలైట్ అయ్యారు. ఈ సినిమా కంటే ముందే పశుపతి నటించిన ఒక సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. నిజ జీవితం ఆధారంగా ఆ సినిమా రూపొందింది. ఆర్య హీరోగా నటించిన సార్పట్ట పరంపర సినిమా ద్వారా పశుపతి తెలుగు వారికి కూడా దగ్గర అయ్యారు.

అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల అయ్యింది. పా రంజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరో గురువు, మాజీ బాక్సర్ అయిన రంగయ్య అనే పాత్రలో పశుపతి నటించారు. పశుపతి ఈ సినిమాలో నటించిన ఎమోషనల్ సీన్స్ చూస్తే మనకే బాధనిపిస్తుంది. అంత బాగా నటించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, సమర అలియాస్ సామ్రాజ్యం (ఆర్య) కి బాక్సింగ్ అంటే చిన్నప్పటినుండి ఇష్టం ఉంటుంది. క్లాసులు కూడా ఎగగొట్టి బాక్సింగ్ చూడడానికి వెళ్లేవాడు. కానీ అతని తల్లి భాగ్యం(అనుపమ కుమార్‌) కి బాక్సింగ్ అంటే ఇష్టం ఉండదు.

ఈ కారణంగానే సామ్రాజ్యం ఉత్తర చెన్నైలో ఉన్న హార్బర్‌లో హమాలి కూలిగా పనిచేస్తూ ఉంటాడు. ఈ బృందాన్ని వాళ్ల గురువు, మాజీ బాక్సర్ అయిన మాజీ బాక్సర్ రంగయ్య (పశుపతి) నడిపిస్తూ ఉంటాడు. ఒకసారి రంగయ్యకి బాక్సర్ వేటపులి (జాన్ కొక్కెన్) వల్ల అవమానం జరుగుతుంది. అప్పుడు సామ్రాజ్యం బాక్సింగ్ లోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. 1975 ప్రాంతంలో ఈ సినిమా నడుస్తుంది. సినిమాలో సెట్టింగ్స్ చాలా బాగా అనిపిస్తాయి.

అప్పటి కాలాన్ని గుర్తుచేసే లాగానే ఉంటాయి. నటీనటుల పర్ఫార్మెన్స్ కి తోడు, టెక్నికల్ గా కూడా సినిమా బాగుండడం, మంచి స్క్రీన్ ప్లే ఉండడం, వీటన్నిటితో పాటు, సంతోష్ నారాయణన్ మంచి సంగీతం అందించడం కూడా ఈ సినిమాకి అదనంగా బలాన్ని ఇచ్చాయి. డబ్బింగ్ సినిమా చూస్తున్న ఆలోచన రాదు. డబ్బింగ్ లో కూడా అంత బాగా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమా కూడా అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉన్నట్టు ప్రకటించారు. 2026 లో ఈ సినిమా విడుదల అవుతుంది.


End of Article

You may also like