కంటిలోని కణాలే ప్రధాన లక్ష్యంగా వైరస్ దాడి చేస్తుందట..! ఇప్పటివరకు 30 శాతం మంది రోగులలో.!

కంటిలోని కణాలే ప్రధాన లక్ష్యంగా వైరస్ దాడి చేస్తుందట..! ఇప్పటివరకు 30 శాతం మంది రోగులలో.!

by Anudeep

Ads

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో దేశాలన్ని పోరాడుతున్న సంగతి తెలిసిందే…సుమారు ఆరు నెలల క్రితం మొట్టమొదటి కేసు బయటపడింది..ఇప్పటివరకు కరోనాకి వ్యాక్సిన్ కనుక్కునే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి..ఒక్కో దేశం ఒక్కో చికిత్సావిధానాన్ని అమలు చేస్తోంది..ఇదిలా ఉంటే  ఇప్పటివరకు ముక్కు,నోటి ద్వారా వ్యాపిస్తుందని మాస్క్ ధరస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాం..కాని కళ్ల ద్వారా కూడా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుందనే విషయం ఇప్పుడు మరింత కలవరపెడుతోంది.

Video Advertisement

కళ్ల ద్వారా కూడా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించగలదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కళ్ల ద్వారా మాత్రమే కాదు, కన్నీళ్ల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి జరుగుతుందంటున్నారు. కంటిలోని కణాలే ప్రధాన లక్ష్యంగా ప్రాణాంతక వైరస్ దాడి చేస్తుందని గుర్తించినట్టు సైంటిస్టులు చెబుతున్నారు.జాన్ హాప్ కిన్స్ యూనివర్శిటి స్కూల్ ఆఫ్ మెడిసిన్  బృందం కరోనా వైరస్ ACE-2 గ్రాహకాలపై ప్రభావవంతంగా పనిచేస్తుందని గుర్తించింది.  కళ్ళు ACE-2 (angiotensin-converting enzyme 2 )ను ఉత్పత్తి చేస్తున్నాయని , కరోనా వైరస్ ఈ కణాలు లక్ష్యంగా చేసుకుందని తెలిపింది.

బాల్టిమోర్‌లోని జాన్స్‌ హాప్‌కిన్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్, ఆప్తాల్మాలజీ విభాగానికి చెందిన లింగ్లీ జూ నాయకత్వంలో జరిగిన పరిశోదనల్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా లేదా దగ్గినా అతడి నుండి వెలువడే నీటి తుంపర్లు కంటి ఉపరితలంపైకి వస్తే.. వైరస్ అక్కడ కణాలలోకి చొరబడటం ప్రారంభిస్తుంది. కొంతమంది రోగులు కండ్ల కలకను అనుభవించారని, దీనికి కారణం వైరస్ అని గుర్తించినట్టు చెప్పారు. తద్వారా కంటి వాపు అది ఎర్రగామారుతుందని, వైరస్ సోకి చనిపోయిన వారి కళ్లపై పరిశోధన జరిపి ఈ లక్షణాలను గుర్తించారు.

చైనాలో కళ్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెంది  26మంది మరణించారు.. ఇప్పటివరకు 30 శాతం మంది రోగులలో కండ్ల కలకలు, కళ్లు ఎర్రగా మారి, వాపు రావడం లక్షణాలను గుర్తించారు. ఇటువంటి పరిస్థితుల్లో కళ్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా, కళ్లను రక్షించుకోవడానికి గాగుల్స్ ధరించాలని సూచించారు.


End of Article

You may also like