Ads
సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మారు మోగుతున్న పేరు “లోకేష్ కనగరాజన్”. లోక నాయకుడు కమల్ హాసన్ కి ‘విక్రమ్’ సినిమాతో చాలా సంవత్సరాల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడిగా ఇతడిని కమల్ హాసన్ తో పాటు ఆయన అభిమానులు కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Video Advertisement
కమల్ సహాన్ లాంటి ఒక టాప్ హీరోని హ్యాండిల్ చేయడమే డైరెక్టర్స్ కి అతి పెద్ద సవాల్. అలాంటి ఒక సవాల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాజిల్ లాంటి మరో ఇద్దరు విభిన్న నటుల్ని ఎంచుకుని వారిద్దరికి సినిమాలో సమాన ప్రాధాన్యం కల్పించాలి అంటే, ఎంత పెద్ద డైరెక్టర్ కి అయిన కత్తి మీద సాము లాంటిదే.
అటువంటి అతి పెద్ద సాహసం తో పాటు గతం లో వచ్చిన ఖైదీ సినిమా స్టోరీ కి అనుసంధానం గా ఉన్న ఒక కథని తీసుకుని ఇంత పెద్ద సినిమాకి శ్రీకారం చుట్టాడు అంటే, లోకేష్ గట్స్ కి సినీ ప్రపంచం సలాం కొట్టాల్సిందే. గతం లో నగరం, ఖైదీ, మాస్టర్ సినిమాలతో సక్సెస్ ట్రాక్ మీద ఉన్న ఈ డైరెక్టర్ ఒక సినిమా కథలో కొన్ని పాత్రలని, సన్నివేశాలను తీసుకుని వాటి నేపధ్యంతో మరొక కొత్త సినిమా తీసే విభిన్న సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. దీనినే “ఇంటర్లింకెడ్ స్టోరీ కాన్సెప్ట్” అంటున్నారు సినీ జనాలు.
మూస సినిమా ధోరణి కి స్వస్తి పలుకుతూ, వెండితెర మీద సరికొత్త ప్రయోగాలతో విజయాలు అందుకుంటున్న లోకేష్ కనగరాజన్ మరిన్ని విజయంతమైన సినిమా లతో సౌత్ లో టాప్ డైరెక్టర్ గా ఎదగాలని అటు తమిళ సినీ అభిమానులతో పాటు, ఇటు తెలుగు సినిమా అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు.
End of Article