Home Filmy Adda అప్పట్లో బ్రహ్మానందంతో కమల్ హాసన్ సినిమా ప్లాన్ చేసారని తెలుసా..? ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందంటే?

అప్పట్లో బ్రహ్మానందంతో కమల్ హాసన్ సినిమా ప్లాన్ చేసారని తెలుసా..? ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందంటే?

by Anudeep

భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అతి కొద్దీ మంది ఉత్తమ నటులలో కమల్ హాసన్ ఒకరు. ఆయన అన్ని రకాల జోనర్లలోనూ సినిమాల్లో నటించి అలరించారు. ఇక కామెడీ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఎక్కువగా ఆక్షన్ థ్రిల్లర్ మూవీస్ లలో కనిపిస్తున్నా… ఒకప్పుడు కమల్ హాసన్ కామెడీ సినిమాలలో కూడా నటించి మెప్పించారు.

దాదాపు గత 60 సంవత్సరాలుగా ఆయన చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ వస్తున్నారు. ప్రొడక్షన్, మ్యూజిక్, డైరెక్షన్ ఇలా అన్ని సినిమా రంగాల్లోనూ తనదైన ప్రతిభను చాటారు. తన టాలెంట్ ను కేవలం నటనకు మాత్రమే పరిమితం చేయలేదు.

kamal haasan vikram hitlist review

నవరసాలను అద్భుతంగా పండించారు. అయితే.. కామెడీ పండించడం అనేది మాత్రం అంత తేలికైన విషయం ఏమీ కాదు. ఇందులో కమల్ హాసన్ ది అందెవేసిన చేయి. కామెడీని టైమింగ్ కి తగ్గట్లే చెయ్యాలి. అలా టైమింగ్ కి తగ్గట్లు హావభావాలను ప్రదర్శిస్తూ కామెడీ చేసే స్టార్ హీరోల లిస్ట్ తీస్తే.. అందులో కమల్ హాసన్ ముందుంటారు. అయితే ఆయన ఉన్నట్లుండి కామెడీ సినిమాలను తీయడం ఆపేసారు. ఆయన చివరగా తీసిన కామెడీ ఫిలిం “మన్మధ బాణం”. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది.

10 brahmanandam

నిజానికి మన్మధ బాణం సినిమా తరువాత కామెడీ జోనర్ లోనే మరో సినిమా రావాల్సి ఉంది. ఈ సినిమాను కూడా కామెడీ జోనర్ లోనే బ్రహ్మానందంతో కలిసి చేయాలనీ కమల్ ప్లాన్ చేసారు. ఈ సినిమాకు “శభాష్ నాయుడు” అనే టైటిల్ ను కూడా అనుకున్నారు. స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్ మాత్రం ఆగిపోయింది. అసలు షూటింగ్ ను కూడా పూర్తిగా చేయలేదు. ఈ సినిమా డైరెక్టర్ రాజీవ్ కుమార్ మరణంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. ఆ తరువాత ఎడిటర్ జేమ్స్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.

sabhash nayudu

తరువాత కమల్ కాలికి గాయం అయ్యింది. భార్య గౌతమితో విడాకులు తీసుకోవడం.. కమల్ రాజకీయాల్లోకి రావడం ఇలా ఒకదానివెంట ఒకటి జరుగుతూనే ఉన్నాయి. 2016 లో ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసారు. కానీ ఇప్పఇతవరకు షూటింగ్ పట్టాలెక్కలేదు. అయితే.. ప్రస్తుతం విక్రమ్ సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న కమల్ ఈ సినిమాను తిరిగి పట్టాలెక్కించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది.

You may also like