ప్రాణంగా ప్రేమించింది…కానీ శ్రీవిద్య కమల్ ని ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయింది.? నిజాలు చెప్పేసిన వదిన విజయలక్ష్మి!

ప్రాణంగా ప్రేమించింది…కానీ శ్రీవిద్య కమల్ ని ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయింది.? నిజాలు చెప్పేసిన వదిన విజయలక్ష్మి!

by Harika

Ads

గత తరం నటీమణి శ్రీవిద్య గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. బాలనటిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీవిద్య ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో 500 సినిమాలు వరకు నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. ఈమె తన కళ్ళతోనే నటిస్తుంది అంటూ ప్రముఖుల నుంచి కితాబుని అందుకున్న ఘనత శ్రీవిద్యది. అయితే 2006లో క్యాన్సర్ తో చనిపోయింది. ఆమె జీవితంలోని రహస్యాలను గురించి ఆమె అన్న భార్య అయిన విజయలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Video Advertisement

ఒకప్పుడు కమల్ హాసన్ శ్రీవిద్య ప్రేమించుకున్నారని కమలహాసన్ పెళ్లి చేసుకోకుండా ఆమెని మోసం చేశాడని అప్పట్లో బాగా రూమర్స్ వచ్చాయి. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది విజయలక్ష్మి శ్రీ విద్య కమల్ హాసన్ ని ఎంతో ప్రేమించింది కానీ కమల్ హాసన్ వాణిని ప్రేమించాడు. ఆ తర్వాత కమలహాసన్, శ్రీవిద్య కలిసి కొన్ని సినిమాలు చేశారు తద్వారా వారు నిజంగానే ప్రేమలో పడిపోయారు. శ్రీవిద్య అన్న, నా భర్త అయిన శంకర్, కమల్ హాసన్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్.

శ్రీవిద్య ని పెళ్లి చేసుకోవాలని ఉంది అని నా భర్తతో చెప్పారు కమల్ హాసన్. ఇంట్లో అడిగి చెప్తాను అని నా భర్త తల్లి వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే మా అత్తగారు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అప్పుడప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్న శ్రీవిద్య కి ఎప్పట్లో పెళ్లిచేసే ప్రసక్తి లేదు అని చెప్పుకొచ్చింది. కమల్ హాసన్ వెయిట్ చేస్తాను అని చెప్పినా కూడా ఒప్పుకోలేదు.ఆమె సంసారం కూడా సజావుగా సాగలేదు ఆ భయం కూడా ఆమెకి ఉండి ఉంటుంది అన్నారు విజయలక్ష్మి.

అయితే తన పెళ్లి ఎలాగైనా కమల్ హాసన్ తో చేయాలని శ్రీవిద్య తన అన్నని బ్రతిమాలిందని కానీ తల్లి ఒప్పుకోకపోవడం వలన పెళ్లి జరగలేదని అప్పుడు కమలహాసన్ వాణిని పెళ్లి చేసుకున్నాడని చెప్పుకొచ్చింది విజయలక్ష్మి. ఆ తర్వాత శ్రీవిద్య మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ పెళ్లయిన కొద్దిరోజులకే విడాకులు తీసుకుంది. 2003లో రొమ్ము క్యాన్సర్ కి గురైన శ్రీవిద్య 2006లో మరణించింది.


End of Article

You may also like