పెళ్లిలో ఈ జంట చేసిన పనికి అందరు ఫిదా..! నిజమైన దంపతులంటే వీరే అనుకుంట..!

పెళ్లిలో ఈ జంట చేసిన పనికి అందరు ఫిదా..! నిజమైన దంపతులంటే వీరే అనుకుంట..!

by Anudeep

Ads

సహజ నటి సౌందర్య,శ్రీకాంత్ నటించిన ‘‘కలిసి నడుద్దాం’’సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. శ్రీకాంత్, సౌందర్య పెళ్లి సీన్లో పెళ్లి కూతురైన సౌందర్య, పెళ్లికొడుకైన శ్రీకాంత్ పక్కన నడుస్తుంది. అప్పుడు పురోహితుడు “అమ్మా నువ్వు అమ్మాయివి. అబ్బాయి పక్కన నడవకూడదు కాస్త వెనగ్గా నడవాలి” అని చెపుతాడు. ఆధునిక భావాలున్న సౌందర్య ఆ మాటకు నొచ్చుకుంటుంది. కానీ కమలా శ్రీపాద,యోగ్నిక్ జంట ఆ సంప్రదాయానికి చెల్లు చీటీ ఇచ్చి కొత్తపద్ధతికి శ్రీకారం చుట్టారు. ‘‘సమానత్వం’’గా పెళ్లి చేసుకున్నారు. ఇదేం పెళ్లి అనుకుంటున్నారా మీరే చదవండి.

Video Advertisement

స్త్రీ పురుషుల సమానత్వం గురించి ఉపన్యాసాలిచ్చేవాళ్లే కానీ, ఆచరణలో చూపేవాళ్లు బహు తక్కువ మంది. కానీ కమల శ్రీపాద, యోగ్నిక్ తమ పెళ్లి ఎలా జరగాలో ముందే అంతా ప్లాన్ చేసుకున్నారు . అభిరుచులతో పాటు ఆలోచనలను పంచుకున్న ఈ ఇద్దరు. పెళ్లిలో ఆడపిల్ల ఇలా ఉండాలి..ఆడపెళ్లివారు మగపెళ్లివారికి ఇటువంటి మర్యాదల్ని చేయాలి. అనే కొన్ని పద్దతులకు స్వస్తి చెప్పి ఆడ,మగా ఇద్దరూసమానమే అని చాటి చెప్పారు.

ప్రకృతిలో స్త్రీపురుషులు ఇద్దరూ సమానం. అటువంటి ప్రకృతిసహజమైన పెళ్లిని ‘‘సమానత్వ’’మైన పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీంతో పెళ్లి బట్టలు కొనటం నుంచి అన్ని పనులు ఇద్దరూ సమానంగా చేసుకున్నారు. పంజాబీ సంప్రదాయాలల్లో నాలుగు పద్దతులను వీరు తమ పెళ్లినుంచి నిషేధించారు. దీంట్లో భాగంగా  తమ పెళ్లిలో ‘‘కన్యాదానం’’ ఉండకూడదనుకున్నారు.

‘‘వరుడు కాళ్లు కడిగి’’ఇదిగో బాబూ ఇప్పటివరకూ ఆమె మా బిడ్డ ఇక నుంచి నీది అంటూ దానం ఇవ్వటం ఏంటీ ? అటువంటి పద్దతి వద్దు అని నిర్ణయించుకున్నారు . దీంతో పెళ్లిలో ‘‘కన్యాదానం’’ ఘట్టం లేదు.  అలాగే పెళ్లిలో మంత్రాలు చదివినప్పుడు “మమా” అనుకోవటం కష్టాల్లోను సుఖాల్లోను ఆమెను విడిచిపెట్టనని వరుడు ప్రమాణం చేసినట్లుగా వధువు కూడా ప్రమాణం చేసింది.

అంతేకాదు..వివాహాంలో అతి ముఖ్యమైన ఘట్టం వధూవరులిద్దరూ అగ్నిసాక్షిగా సప్తపది వేయటం. ఏడడుగులు నడిచేప్పుడు వధువు వరుడి వెనకాల నడవాలి, అది కూడా తలదించుకుని , కానీ కమలా శ్రీపాదా యోగ్నిక్ లిద్దరూ పెళ్లిలో అతి ముఖ్యమైన ఈ తంతును చాలా ఆధునికంగా,ఆదర్శవంతంగా చేశారు. యోగ్నిక్ వెనుకగా కాకుండా పక్కనే నడిచింది.

“ భార్యాభర్తలిద్దరూ జీవితంలో కష్టసుఖాలను పంచుకుంటూ ఒకరి అండగా మరొకరు నిలవాలి. అటువంటప్పుడు ఒకరి వెనకాల కాకుండా పక్క పక్కనే నడిస్తే ఎంత బాగుంటుందో కదా..అందుకే మేము ఇలా చేయాలని అనుకున్నామని, ‘‘సమానంగా’’చేతిలో చేయి వేసుకుని నడవటంతో ఎంత ఆనందముంటుంది..అని నూతన దంపతులు సంతోషంతో కూడిన సగర్వంగా చెప్పారు.

ఈ కాలం పిల్లలకు ఏం తెలుసండి కుర్రకుంకలు అని తక్కువగా అంచనా వేయకండి . వాళ్లు తల్లిదండ్రులకంటే ఉన్నతంగా ఆలోచించవచ్చు . అప్పుడప్పుడు ఇలాంటి పనులతో సమాజాన్నే ఆశ్చర్యపరచవచ్చు . కాబట్టి ముందు మీ పిల్లలు చెప్పేది వినండి అందులో మంచి ఉంటే ఆహ్వానించండి, చెడు ఉంటే వివరించి చెప్పండి. అంతేకాని ముందే ఒక డెసిషన్ కి వచ్చేయకండి.


End of Article

You may also like