యువ నటి, రష్యన్ యువతి అలెగ్జాండ్రా జావి అనుమానాస్పదం గా మరణించారు. రాఘవ లారెన్స్ దర్శకత్వం లో ఆమె “కాంచన – 3 ” సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఆత్మహత్య కు పాల్పడిందన్న వార్తలు రావడం తో అందరు షాక్ అవుతున్నారు. గోవా లో హోటల్ లోనే ఆమె మృతి చెందిందని తెలుస్తోంది. దీనితో.. ఆమె మరణం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

javi 1

ఆమెను ఎవరైనా హత్య చేశారా..? అన్న కోణం లో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆమె సన్నిహితులు చెబుతున్న వివరాలను పరిశీలించి చూస్తే.. జావి ప్రేమ జీవితం లో విఫలం అయిందని.. ఆ బాధను భరించలేకే ఆత్మహత్య కు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. కొద్దీ రోజుల క్రితమే ఆమె ప్రియుడితో గొడవలు వచ్చి విడిపోయిందని తెలుస్తోంది. డిప్రెషన్ ను తట్టుకోలేకే ఆమె ఈ పని చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

javi 2

గతం లో 2019 వ సంవత్సరం లో కూడా చెన్నై ఫోటోగ్రాఫర్ లైంగికం గా వేధించడం తో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు కూడా. అయితే.. ఈ కేసుకు ఆమె మృతికి ఏమైనా సంబంధం ఉందా..? అన్న దిశగా కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆమె మరణవార్త ను కుటుంబసభ్యులకు కూడా తెలిపారు. 24 ఏళ్ల వయసులోనే ఆమె విగతజీవిగా మారడం తో కుటుంబసభ్యుల బాధ పట్టనలవి కాకుండా ఉంది.