Ads
Chandramukhi 2: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ‘తలైవి’ సినిమా తర్వాత మరో తమిళ సినిమాలో నటించేందుకు సిద్దం అయ్యింది. పి. వాసు దర్శకత్వం వహిస్తున్న ‘చంద్రముఖి 2’లో చంద్రముఖి పాత్రలో నటించనుంది. 2005లో విడుదలైన ఈ చిత్రం ప్రీక్వెల్ ‘చంద్రముఖి’లో సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక నటించారు.
Video Advertisement
‘చంద్రముఖి’ సినిమాలో జ్యోతిక చంద్రముఖిగా చేసిన అద్భుత నటనకు అప్పటి ఆడియెన్స్ మంత్రముగ్దులయ్యారు. జ్యోతిక ఒక వైపు గంగ అనే పాత్రలో అమాయకంగా కనబడుతూనే మరో వైపు చంద్రముఖి పాత్రలో భయ పెట్టిన తీరు అందరిని మెప్పించింది. అందులో చంద్రముఖిగా ఆమె చేసిన నాట్యాన్ని చూసిన ఆడియెన్స్ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆ టైమ్ లోనే రూ. 9 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ రూ. 70 కోట్లకు పైగా వసూల్ చేసింది. అయితే ఈ సినిమా మలయాళ మూవీ ‘మణిచిత్రతాజు’కి రీమేక్. బాలీవుడ్ లోనూ అక్షయ్ కుమార్ తో ‘భూల్ భులైయా’ గా తీశారు. అక్కడ కూడా విజయం పొందింది.
కంగనా రనౌత్ ‘చంద్రముఖి 2’లో రాజుగారి ఆస్థానంలో ఉండే ప్రసిద్ద నర్తకి పాత్రలో కనిపించనుంది. కంగనా రనౌత్ కు జంటగా తమిళ నటుడు రాఘవ లారెన్స్ నటించనున్నారు. ఇక ఈ సినిమాకి జాతీయ అవార్డు గ్రహీత కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా పని చేయనున్నారు. కంగనా ఈ పాత్రను చేయనుండడంతో ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో మొదలవుతుందని సమాచారం.
కంగనా రనౌత్ ఈ షెడ్యూల్ లో పాల్గొననుందని తెలుస్తోంది. కంగనా దర్శకత్వం వహిస్తున్న రెండవ సినిమా ‘ఎమర్జెన్సీ’ తరువాత షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటుంది. అది ముగిసిన తర్వాత ‘చంద్రముఖి 2’ సెకండ్ షెడ్యూల్ జనవరిలో మొదలవుతుంది. ఈ సినిమాను అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన లైకా నిర్మిస్తోంది. ఇక కంగనా రనౌత్ ‘తేజస్’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇందులో ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రను పోషిస్తుంది. ఆమె చేతిలో మరో ప్రాజెక్ట్ ‘నోటి బినోదిని’ కూడా ఉంది.
End of Article