జూన్ 4 న నటి యామి గౌతమ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నేపధ్యం లో అత్యంత సన్నిహితుల సమక్షం లోనే యామి గౌతమ్ ఆదిత్యను వివాహం చేసుకున్నారు. అయితే.. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. వీటిలో యామి ఫోటో పైన నాటంటూ విక్రాంత్ ఆమెను రాధేమా తో పోలుస్తూ కామెంట్ చేసారు.

kangana ranuth

ఈ కామెంట్ కు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించారు. “ఈ బొద్దింక ఎక్కడ నుంచి వచ్చింది.. నా చెప్పు తీసుకురండి..” అంటూ కంగనా కామెంట్ చేసారు. అంతే కాదు ఆమె యామి ఫొటోకు కూడా “డివైన్ అండ్ బ్యూటిఫుల్ అంటూ స్పందించారు. హిమాచల్ పెళ్లి కూతురు ఎప్పుడు అందం గానే ఉంటుంది.. వధువు గా మారిన పర్వత ప్రాంత అమ్మాయి కంటే దైవత్వమేమి లేదు..” అంటూ ఆమె యామి ఫోటోను షేర్ చేస్తూ కాప్షన్ ను జత చేసారు.