Ads
ఈ ప్రపంచంలో ఒక ఆడపిల్లకి తొలి హీరో తన తండ్రే.. ఏదైనా సమస్య వస్తే కన్నతండ్రి రక్షిస్తాడనే ధైర్యం ఉంటుంది..లేదంటే ఆ సమస్య నుండి ఎలా బయటపడాలనే గుండెధైర్యం నింపేది కన్నతండ్రే..కాని అటువంటి తండ్రే తనకు సమస్య సృష్టిస్తే..కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక కసాయి తండ్రి, కన్నకూతురు అని చూడకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. లాక్ డౌన్ పీరియడ్లో మధ్యప్రదేశ్లో జరిగిన ఒక అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
Video Advertisement
లాక్ డౌన్ పీరియడ్లో ఇంట్లోనే ఉంటున్న ఆ కసాయి తండ్రి, వయసులో ఉన్న కూతురిపై కన్నేసి , వంటగదిలో పనిచేసుకుంటున్న కూతురిని తన రూంకి లాక్కొచ్చి అత్యాచారం చేశాడు. పెళ్లి తర్వాత నీకెలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అంటూ ఆ రాక్షసుడు కూతురుని లోబరుచుకుంటే , దానికి స్వయంగా కన్నతల్లే సాయం చేయడం శోచనీయం. కూతురు అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కింది ఆ కన్నతల్లి.
ఏప్రిల్ నెల 10వ తేదిన ఈ ఘటన చోటు చేసుకుంది.. ఆ తర్వాత ఒకసారి అమ్మాయి ఇంటి నుండి తప్పించుకుని , దగ్గరలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లగా , వారు కూడా కాల్ చేసి తల్లిదండ్రులను పిలిపించి తిరిగి ఇంటికి పంపించారు. ఆ తర్వాత కూతురిపై మరోమారు అమానుషంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.. చివరికి ఈ విషయం ఎలాగోలా అక్కకి చెప్పడంతో, అక్కాచెల్లెల్లిద్దరూ 1098 నెంబర్ కి కాల్ చేసి పోలీసులకు కంప్లైంట్ చేశారు..
అమ్మాయి చెప్తున్నది అబద్దం అని తల్లిదండ్రులిద్దరు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు..కాని అమ్మాయి ఒంటిపై ఉన్న పంటిగాట్లు, చేతిగోర్ల గాట్లతో అమ్మాయిపై అత్యాచారం జరిగిందనే నిర్దారణకు వచ్చి తల్లిదండ్రులపై కేస్ ఫైల్ చేశారు పోలీసులు.తను హైస్కూల్ డేస్ నుండి తండ్రి తనని వేధిస్తున్నాడని, తననే కాదు తన అక్కపైన కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డాడని ఆ అమ్మాయి చెప్పడంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
లాక్ డౌన్ పీరియడ్ లో ఇంటిల్లిపాది ఇంట్లోనే ఉంటున్నారు..దీంతో గృహిణులకు పని ఒత్తిడి పెరగడమే కాదు, గృహహింస కూడా పెరిగిందనేది సర్వేలే చెప్తున్నాయి.. ఇలాంటి టైంలో మద్యం అమ్మకాలను ప్రారంభించాయి ప్రభుత్వాలు.. ఈ హింస మరింత ఎక్కువవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..
End of Article