సినీ ఇండస్ట్రీ లో పెళ్లి భాజాలు ఆగట్లేదు…కొందరు కరోనా వలన వాయిదాలు వేసుకుంటుంటే మరికొందరు పెళ్ళిళ్ళు చేసుకోవడానికే మొగ్గుచూపుతున్నారు…స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి పెళ్లి తో మొదలైన ఈ హంగామా..మొన్న యంగ్ హీరో నిఖిల్….దేవెగౌడ మనవడివివాహం,,మొన్నే సాహూ దర్శకుడి ‘సుజీత్’ నిశ్చితార్థం.అతి త్వరలో దగ్గుబాటి వారసుడు రానా కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

Video Advertisement

ఇప్పుడు అయితే కన్నడ సినీ ఇండస్ట్రీ కి చెందిన హీరోయిన్ ఏకంగా ఎవరికీ చెప్పకుండా…పెళ్లి చేసుకున్నారు. శాండల్ వుడ్ కి చెందిన మయూరి క్యాటరి శుక్రవారం ఉదయం స్థానిక గుడిలో వివాహం జరిగింది.కొద్ది పాటి బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు.ట్విస్ట్ ఏంటి అంటే…ఇండస్ట్రీ లోనే ఎవరికీ తెలియకుండా పెళ్లి జరిగిపోయింది అట.ఈ సందర్భంగా..తన ఇంస్టాగ్రామ్ ద్వారా పెళ్ళికి సంబంధించి వీడియో పోస్ట్ చేస్తూ.’అవును నేను పెళ్లి చేసుకునాన్ను..మా పది సంవత్సరాలా స్నేహానికి మంచి ముగింపు పడింది.

మరిన్ని విషయాలు అతి త్వరలో మీతో పంచుకుంటాను అంటూ షేర్ చేసింది ఇప్పుడు ఈ ఫొటోస్ నెట్ ఇంట వైరల్ గా నిలిచాయి.పాపం లాక్ డౌన్ కష్టాలు సెలెబ్రెటీస్ కూడా తప్పట్లేదు. జీవితం లో ఒక్కసారి జరిగే పెళ్లి ఎవరికైనా అందరిని పిలిచి చేసుకోవాలనే ఉంటుంది కదా.లాక్ డౌన్ నిబంధల దృష్ట్యా ఇలా చేసుకోవాల్సి వస్తుంది.తప్పదు మరి.